Congress Leaders protest at DGP office

Congress leaders protest at dgp office

Congress, MIM, Asaduddin Owisi, Uttam Kumar Reddy, Bhatti Vikramarka

Congress Leaders Uttam Kumar Reddy, Bhatti Vikramarka protesting for justice on MIM attack.

ఎంఐఎం దాడులకు నిరసగా డీజీపీ కార్యాలయం ముట్టడి

Posted: 02/02/2016 07:08 PM IST
Congress leaders protest at dgp office

పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ రౌడీయిజాన్ని ప్రదర్శించిందని.. అసదుద్దీన్ ఓవైసీని వెంటనే అరెస్టు చెయ్యాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణ డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు డీజీపీ ఆఫీస్ ముందు బైఠాయించారు. ఆసిఫ్ నగర్, పురానాపూల్ లలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు దిగారు. అసదుద్దీన్ ను వెంటనే అరెస్టు చేసేంత వరకు తాము తగ్గేదిలేదని కాంగ్రెస్ కార్యకర్తలు ఖరారు చేశారు. ఎక్కడైతే కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడి చేశారో.. అక్కడ తిరిగి పోలింగ్ నిర్వహించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

డీజీపీ కార్యాలయం ముందు బైఠాయించిన కాంగ్రెస్ నేతలు. పురానాపూల్ లో కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి షబ్బీర్ అలీ మీద దాడికి పాల్పడటం.. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ ఇంటి మీద దాడికి దిగడం మీద కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అసదుద్దీన్ ను వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ నాయకుల మీద జరిగిన దాడిపై సిఎం, హోంమంత్రి స్పందిచాలపి భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  MIM  Asaduddin Owisi  Uttam Kumar Reddy  Bhatti Vikramarka  

Other Articles