Kerala CM Chandy faces FIR

Kerala cm chandy faces fir

Kerala, Oommen Chandy, Chief Minister Oommen Chandy, Solar scam

Alarming the Congress high command in Delhi, and with barely three months left for assembly elections in Kerala, a Vigilance court today ordered the registration of an FIR against Chief Minister Oommen Chandy in the solar scam. The court’s direction came a day after one of the accused in the scam, Saritha S Nair, alleged that she paid Rs 1.9 crore as bribe to Chandy

ముఖ్యమంత్రి మీద FIR నమోదు

Posted: 01/29/2016 08:25 AM IST
Kerala cm chandy faces fir

సోలార్ స్కామ్ -లో కేరళ సీఎం ఊమెన్ చాందీకి మరిన్ని చిక్కులు వచ్చపడ్డాయి. ఈ స్కామ్ కు సంబంధించి చాందీ, విద్యుత్ శాఖ మంత్రి ఆర్యదన్ లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ త్రిసూర్ లోని ప్రత్యేక విజిలెన్స్ కోర్టు విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించింది. సోలార్ కంపెనీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేందుకు చాందీకి అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తికి 1.9 కోట్లు, విద్యుత్ మంత్రికి 40 లక్షలు లంచంగా ఇచ్చానంటూ ఈ స్కామ్‌ లో ప్రధాన నిందితురాలు సరిత ఆరోపణలు చేయడంతో పీడీ జోసెఫ్ అనే వ్యక్తి వేసిన ప్రైవేటు ఫిర్యాదుపై విజిలెన్స్ కోర్టు పై విధంగా స్పందించింది.

మరో పక్కన ఊమెన్ చాందీని మరింతగా ఇరుకున పెట్టేలా సరిత మరో బాంబు పేల్చింది. సోలార్ స్కామ్ వాస్తవాలను వెల్లడించవద్దంటూ 2013లో తన తల్లికి చాందీ ఫోన్ చేశారని, తాము ఇచ్చిన డబ్బులు తిరిగిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ‘కాంగ్రెస్(బీ) నేత గణేశ్ కుమార్ పీఏ ప్రదీప్ మా అమ్మతో పాటు జైలుకు వచ్చి నన్ను కలిశాడు. సీఎం మా అమ్మతో ఫోన్ లో మాట్లాడారని, అన్ని కేసులు, ఆర్థిక వ్యవహారాలను సెటిల్ చేస్తామని హామీ ఇచ్చారని నాకు చెప్పాడు’ అని సరిత వివరించారు. తాను పోలీసు కస్టడీలో ఉండగా స్కామ్ వివరాలతో తాను రాసిన 30 పేజీల లేఖను ఆ తరువాతే 4 పేజీలకు కుదించానన్నారు. స్కామ్‌ లో పెద్దవారి పాత్ర ఉందంటూ తాను చేసిన ఆరోపణలకు రుజువులు ఉన్నాయని ఆమె చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  Oommen Chandy  Chief Minister Oommen Chandy  Solar scam  

Other Articles