Sujana Chowdary requested to Pawan Kalyan for election champign

Sujana chowdary requested to pawan kalyan for election campaign

Pawan Kalyan, Janasena, pawan Kalyan News, janasena Pawan Kalyan, GHMC election, Pawan Kalyan in GHMC, Pawan Kalyan in GHMC Elections

Central Minister Sujana chowary called to Janasena Party Leader Pawan kalyan. He requested to champaign in the GHMC elections to support the BJP and TDP alliance.

ప్రచారం కోసం సుజనా ఫోన్.. కుదరదన్న పవన్..!

Posted: 01/27/2016 11:49 AM IST
Sujana chowdary requested to pawan kalyan for election campaign

గ్రేటర్ హైదరాబాద్ లో ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని పార్టీలు గెలుపు అవకాశాల కోసం అన్వేషిస్తున్నాయి. ఎలాగైనా గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు సాదించాలని అన్ని పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ, బారతీయ జనతా పార్టీతో కలిసి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉమ్మడిగా సోటీ చేస్తున్నాయి. అయితే ఈ రెండు పార్టీల తరఫున ప్రచారం చెయ్యడానికి పెద్దగా ఫేం ఉన్న నాయకులు ఎవరూ లేకోవడంతో రెండు పార్టీలు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నాయి. అందులో బాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి-టిడిపి కూటమికి మద్దతు ప్రకటించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించేందుకు రెండు పార్టీల నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే జనసేన పార్టీ అధినేతను కొంత మంది బిజెపి నాయకులు వెళ్లి కలిసినట్లు వార్తలు వచ్చాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టిడిపి-బిజెపి పార్టీ తరఫున ప్రచారం చెయ్యాలని కోరగా.. పవన్ దాని మీద స్పందించలేదని తెలిసింది. కాగా మరో సారి కేంద్ర మంత్రి సుజనా చౌదరి వపన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి.. ప్రచారం కొసం రావాలని అడిగారట. అయితే పవన్ కళ్యాణ్ తన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ ఉన్నందున రాలేనని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి పవన్ కళ్యాణ్ ఎందుకు దూరంగా ఉంటున్నారో... అని విశ్లేషకులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Janasena  janasena  GHMC election  

Other Articles