19 Men dead in America

19 men dead in america

America, Strom, Winter, Snow

A massive winter storm clobbered the East Coast , dumping more than three feet of snow in parts of West Virginia and Maryland, tying up traffic on highways, grounding thousands of flights and shutting down travel in the nation's largest city. From the Carolinas to New York, tens of thousands were without power Saturday night as a result of the storm, which was finally heading out to the Atlantic.

అమెరికాలో మంచు తుపానుకు 19 మంది బలి

Posted: 01/24/2016 05:58 PM IST
19 men dead in america

అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను గడగడ వణికిస్తోంది. దేశ రాజధాని వాషింగ్టన్ లో ఒక్క రోజే 30 అంగుళాల మేర మంచు కురిసింది. అమెరికాలోని మొత్తం 10 రాష్ట్రాలు స్టేట్ ఎమర్జెన్సీని ప్రకటించాయి. మంచు తుపాను దెబ్బకు ఇప్పటి వరకు 9 మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. పది లక్షల మంది మంచులో ఇరుక్కున్నట్లు వారు ప్రకటించారు. జార్జియా, ఉత్తర కరోలినా, టెన్నెస్సీ, మేరీలాండ్, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, న్యూయార్క్, కెంటకీ రాష్ట్రాలు మంచు తుపానుకు విలవిల్లాడిపోతున్నాయి. ఒక్క వర్జీనియాలోనే దాదాపు 800 ట్రాఫిక్ ప్రమాదాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. వర్జీనియాలోని గురుద్వారాలు, ఆలయాల్లో మంచులో చిక్కుకుపోయిన వారికి పునరావాసం కల్పిస్తున్నారు. ఈ తుపాను వల్ల దాదాపు లక్షా ఇరవై వేల ఇళ్లల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాదాపు వంద బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ పరిస్థితిలో మార్పు రాదని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది.

మంచు తుపాను కారణంగా అమెరికా వణికిపోతోంది. దేశ తూర్పు ప్రాంతాన్ని దుప్పటిలా మంచుతో కప్పేసింది. పలు రాష్ర్టాల్లో మంచు తుపాను 19 మందిని బలితీసుకుంది. మంచు కారణంగా అర్కాన్‌సాస్, నార్త్ కరోలినా, కెంటకి, ఓహియో, టెన్నెస్సి, వర్జీనియా రాష్ర్టాల్లో జరిగిన కారు ప్రమాదాల్లో 13 మంది మృతిచెందారు. మేరీల్యాండ్‌లో ఒకరు, న్యూయార్కులో ముగ్గురు మంచు కారణంగా మరణించారు. వర్జీనియాలో హైపోథెర్మియా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America  Strom  Winter  Snow  

Other Articles