Woman allegedly gang-raped at gunpoint in moving car in Noida

35 year old woman gang raped at gunpoint in moving suv in delhi

Noida rape,Woman raped at gunpoint,Noida gangrape,SUV rape,SUV Noida,Delhi gangrape,Rape in SUV, extension, gang-rape, noida, SUV, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women,

A 35-year-old woman was allegedly gang raped at gunpoint by four men in a moving SUV in Noida

ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. వివాహితపై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

Posted: 01/17/2016 02:25 PM IST
35 year old woman gang raped at gunpoint in moving suv in delhi

దేశ రాజధాని నగరం ఢిల్లీలో మరోమారు మగమదమృగాళ్లు దారుణానికి ఒడిగట్టాయి. మూడేళ్ల క్రితం జరిగన నిర్భయ ఘటనను తలపించే విధంగా కదులుతున్న కారులో వివాహతపై పైశాచిక మృగాలు కామదాహంతో పైబడి దారుణానికి పాల్పడ్డాయి. నోయిడాకు చెందిన ఓ వివాహిత(35)పై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. లిఫ్ట్ ఇస్తామని చెప్పి నమ్మించి అఘాయిత్యానికి ఒడిగట్టిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది.

పోలీసులు కథనం ప్రకారం.. నోయిదాడకు చెందిన ఓ మహిళ తన భర్త దగ్గరకు వెళ్లేందుకు బస్టాప్ లో వేచి వుంది. ఇంతలో స్కార్పియో లో వచ్చిన నలుగురు వ్యక్తులు, లిఫ్ట్ ఇస్తామని, గమ్యానికి చేరుస్తామని ఆమెను నమ్మించి వాహనంలో ఎక్కించుకున్నారు. అనంతరం మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఆఫర్ చేసి ...ఆమె మత్తులోకి జారుకున్నాక సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి పారిపోయారు.

అపస్మారక స్థితిలో పడివున్న ఆమెను పోలీసులు గమనించి, చికిత్స నిమిత్తం ఆసుపత్రి తరలించారు. బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు... నిందితులు వీరు, సమీర్ గా గుర్తించారు. మిగిలిన ఇద్దరినీ గుర్తించే ప్రయత్నంలో వున్నామని కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నిర్భయ ఘటన నేపథ్యంలో ఎన్నికల దృష్ట్యా ఘటనపై అప్పట్లో స్పందించి ధర్నాలు రాస్తారోకోలతో అందోళనకు దిగిన రాజకీయ పార్టీలో, యువజనులు.. తాజాగా జరుగుతున్న ఘటనపై మాత్రం కనీసం స్పందించకపోవడం.. అటు ప్రభుత్వం కూడా ఈ ఘటనలు అడ్డుకునేందుకు చర్యలను చేపట్టకపోవడంపై విమర్శలు వినబడుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : extension  gang-rape  noida  SUV  

Other Articles