Gabbar Singh name Peddapalli SI shoot him self

Gabbar singh name peddapalli si shoot him self

Gabbar Singh SI, SI Jagamohan, Peddapalli, Karimnagar, SI Suicide

Gabbar Singh name Peddapalli SI shoot him self. SI JaganMohan named as Gabbar singh for his special character.

పెద్దపల్లి గబ్బర్ సింగ్ ఎస్సై ఆత్మహత్య

Posted: 01/09/2016 09:23 AM IST
Gabbar singh name peddapalli si shoot him self

కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్ తన సర్వీసు రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నెల రెండవ తేదీన జరిగిన బదిలీల్లో భాగంగా జగన్మోహన్ ను జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో రెండవ ఎస్ఐగా బదిలీచేయడంతో మనస్థాపం చెంది ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐ జగన్మోహన్ వ్యవహారశైలి ఇతర పోలీస్ అధికారుల కంటే భిన్నంగా ఉండడంతో గతంలో ధర్మపురిలో పనిచేసినపుడు అక్కడి ప్రజలు గబ్బర్ సింగ్ గా పిలిచేవారు.

పది నెలల క్రితం పెద్దపల్లి ఎస్సైగా వచ్చిన ఆయనను నాలుగు రోజుల క్రితమే జమ్మికుంటకు రెండో ఎస్సైగా బదిలీ చేశారు. బదిలీ విషయంలో తనకు అన్యాయం జరిగిందంటూ సన్నిహితుల వద్ద జగన్మోహన్ పలుమార్లు కంటతడి పెట్టుకున్నట్టు సమాచారం. తనను పెద్దపల్లిలోనే కొనసాగించాలని స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ -రెడ్డిని కలసి ప్రాధేయపడినా బదిలీ ఆగలేదని చెబుతున్నారు. దాంతో మానసిక వేదనకు గురైన జగన్మోహన్ నాలుగు రోజులుగా తన క్వార్టర్స్ నుంచి బయటకు రావడం లేదని బంధువులు తెలిపారు. ఎస్సై జగన్మోహన్ ఆత్మహత్యకు ఎమ్మెల్యే రాజకీయాలే కారణమని మండిపడ్డారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే ఆయనను అన్యాయంగా బదిలీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రాసిన సూసైడ్ నోట్‌ ను పోలీసు అధికారులు దాచిపెడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ ఎస్పీ జోయల్ డేవిస్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gabbar Singh SI  SI Jagamohan  Peddapalli  Karimnagar  SI Suicide  

Other Articles