Delhi's odd-even plan takes baby steps to better air quality

Delhi s odd even plan takes baby steps to better air quality

delhi, India, Odd-eve plan, Kejriwal, Air polution, Air Quality

Pollutants in the city's air dipped by around 10 per cent on average between 8am to 2pm today compared to the last two days, "possibly" due to the odd-even restrictions, before rising sharply afterwards with a fall in day time temperature. As per initial observations of System of Air Quality and Weather Forecasting and Research (SAFAR), the gains of less vehicular emissions could have been more had there been less vehicular movement and no bursting of firecrackers on the night of January 31.

బేసి నెంబర్ల కార్లు ప్రజెంట్.. సరి కార్లు ఆబ్ సెంట్

Posted: 01/02/2016 08:34 AM IST
Delhi s odd even plan takes baby steps to better air quality

సరి-బేసి సంఖ్య విధానానికి ప్రజల నుంచి ఆశించినదానికన్నా అధిక స్పందనే వచ్చిందని, తొలిరోజు పూర్తిగా విజయవంతమైందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఢిల్లీలో తిరిగే వాహనాలకు సరి-బేసి సంఖ్య విధానాన్ని శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి అమలులోకి తెచ్చారు. జనవరి 15 వరకూ రోజు విడిచి రోజు ఓరోజు సరిసంఖ్య, మరోరోజు బేసి సంఖ్య వాహనాలకు మాత్రమే రోడ్లపై తిరిగేందుకు అనుమతిస్తారు. ఈ విధానాన్ని 15 రోజులపాటు ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు మొదటిరోజు ప్రభుత్వ నిబంధనకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని ఆయన పేర్కొన్నారు. దేశానికి ఢిల్లీ మార్గం చూపుతుందంటూ కేజ్రీవాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఐతే,శుక్రవారం పలు ప్రైవేట్‌ సంస్థలు సెలవు పాటిస్తున్నందున అసలైన పరీక్ష సోమవారం నుంచే మొదలవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.

మొదటిరోజు (శుక్రవారం) బేసి సంఖ్య వాహనాలను రోడ్లమీదికి అనుమతించిన ఢిల్లీ ప్రభుత్వం నిబంధనను ఉల్లంఘించే వారిని నియంత్రిం చేందుకు ట్రాఫిక్‌ సిగల్స్‌ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించింది. వారికితోడుగా వందలాదిమంది స్వచ్ఛంద కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నిబంధన ఉల్లంఘించినవారికి గులాబీ పూలిస్తూ పథకం గురించి ప్రచారం నిర్వహించారు. నిబంధనకు విరుద్ధంగా కొందరు సరిసంఖ్య వాహనదారులు రోడ్లమీదికి రాగా, వారికి రూ.2000 చొప్పున జరిమానా విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi  India  Odd-eve plan  Kejriwal  Air polution  Air Quality  

Other Articles