high speed metro train | uppal | yadadri | KCR | NVS reddy | Extension plan

Study soon on metro rail from uppal to yadadri

Hyderabad Metro Rail Limited, Expansion Plan, high speed metro train to yadadri, high speed metro train, uppal, yadadri, KCR, NVS reddy, Miyapur-Patancheru: LB Nagar-Hayatnagar, Nagole-LB Nagar-Falaknuma-Shamshabad, Tarnaka-ECIL Crossroad, Raidurg- Gachibowli-RGia,

Hyderabad Metro Rail Limited (HMRL) will carry out construction of high-speed metro rail from Uppal to the famous hill shrine of Yadagirigutta renamed as Yadadri.

యాదాద్రికి హైస్పీడ్ మెట్రో రైలు.. రెండో ధశకు ప్రభుత్వం సముఖత

Posted: 12/27/2015 01:34 PM IST
Study soon on metro rail from uppal to yadadri

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి అభివృద్ధికి పలు చర్యలు తీసుకొన్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఉప్పల్‌ నుంచి యాదాద్రి వరకూ హైస్పీడ్‌ మెట్రో రైల్‌ నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. హైదరాబాద్‌ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్‌) ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డికి ఇప్పటికే ఈ విషయమై ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ మార్గంపై ప్రత్యేకంగా ప్రణాళిక తయారు చేస్తున్నామని, ఇందుకోసం ఎకరా స్థలం కూడా తీసుకున్నట్లు ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. యాదాద్రిని అభివృద్ధి చేయడంతో పాటు ఈ మార్గంలో ఉన్న బీబీనగర్‌ నిమ్స్‌, వరంగల్‌ రహదారిపై పెరుగుతున్న రద్దీ దృష్ట్యా మెట్రో వస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోవైపు ట్రాఫిక్‌ రద్దీ తగ్గించాలంటే నగరానికి కొంత దూరంలో శాటి లైట్‌ టౌన్‌ షిప్పుల ఏర్పాటు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. ఈ దృష్ట్యా యాదాద్రి వరకు మెట్రో మార్గం వస్తే చుట్టు పక్కల ప్రాంతాల్లో నివాస ప్రాంతాలు పెరిగే అవకాశం ఉంటుందని యోచిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌-వరంగల్‌ హైవే కారిడార్‌ కావడంతో భవిష్యత్తులో ఈ మార్గంలో మెరుగైన ప్రజా రవాణా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

కాగా.. అసెంబ్లీ, సుల్తాన్‌ బజార్‌ ప్రాంతా ల్లో పాత అలైన్‌మెంట్‌ ప్రకారమే పనులు నిర్వహిస్తున్నామని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఈ రెండు మార్గాల్లో అన్నిరకాల ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం అధ్యయనం చేసిందని చెప్పారు. పాత అలైన్‌మెంట్‌ మెరుగ్గా ఉండటంతో ఆమోదించింద న్నారు. సుల్తాన్‌బజార్‌లో చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం కలగదని భరోసా ఇచ్చారు. అలాగే జైన్‌ మందిర్‌, ఆర్య సమాజ్‌ భవనాలకు ఎలాంటి ముప్పు ఉండదన్నారు.

ఇక మరోవైపు మెట్రో రెండో దశకు కూడా ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం 72 కిలోమీట్లర్ల మేర విస్తరించిన మెట్రో రైలను మరో 155 కిలోమీటర్ల మేర పొడగించేందుకు ప్రభుత్వం సుముఖంగా వున్నట్లు సమాచారం. మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఫలక్ నుమా మీదుగా, శంషాబాద్ వరకు, రాయదుర్గ గచ్చిబౌలి మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు, తార్నాక, ఈసిఐఎల్ క్రాస్ రోడ్స్ వరకు రెండో దశ పనులను కూడా మొదటి ధశ పూర్తి కావడంతోనే చేపట్టనున్నట్లు సమాచారం.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : high speed metro train  uppal  yadadri  KCR  NVS reddy  

Other Articles