Sultan warns those celebrating could face up to five years in jail

Sultan warns those celebrating could face up to five years in jail

Christmas, Christmas celebrations, Brunei, Sultan, Muslims, five years in jail

Anyone found illegally celebrating Christmas in Brunei could face up to five years in prison, according to a reported declaration by the Sultan of the tiny oil-rich state. Brunei introduced its ban on Christmas last year over fears that celebrating it "excessively and openly" could lead its Muslim population astray.

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటే జైలు శిక్ష

Posted: 12/23/2015 09:30 AM IST
Sultan warns those celebrating could face up to five years in jail

అత్యంత ధనవంతమైన చిట్టి దేశంగా పేరెన్నికగన్న బ్రూనై దేశంలో క్రిస్మస్ వేడుకలపై సుల్తాన్ హసనల్ బోల్కియా కఠిన ఆంక్షలు విధించారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలతో పాటు ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధించే చట్టాన్ని తీసుకొచ్చారు. క్రైస్తవులు బహిరంగంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకోరాదని, క్రిస్మస్ చెట్లను ఏర్పాటుచేయడం, మతపరమైన పాటలు పాడడం, క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పుకోవడం లాంటి చర్యలన్నింటినీ నిషేధిస్తున్నట్లు బ్రూనై మత విశ్వాసాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ముస్లింలు ఎవరూ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనరాదని, అలా చేస్తే ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తామని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం ప్రకటించింది. క్రిస్మస్ రోజు సెలవుదినం కాబట్టి, క్రైస్తవులు తమ కమ్యూనిటీ మధ్యనే వేడుకలు జరుపుకోవాలని సూచించింది. సుల్తాన్ ఆదేశాలను కచ్చితంగా ఆచరించాలని ఇమామ్‌లు కూడా తమ అనుచరులను ఆదేశించారు. బ్రూనైలో ముస్లింలు దాదాపు 80 శాతం ఉండగా, మిగతా 20 శాతంలో క్రైస్తవులు, బౌద్ధులు ఉన్నారు. అయినా సంవత్సరానికి ఒక సారి వచ్చే క్రిస్మస్ పై ఇలా ఆంక్షలు విధించడం బాగాలేదని చాలామంది క్రైస్తవులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Christmas  Christmas celebrations  Brunei  Sultan  Muslims  five years in jail  

Other Articles