Chandrababu Naidu fearing about that leader

Chandrababu naidu fearing about that leader

call Money, AP, Chandrababu Naidu, Jagan, JaganMohanReddy, YS Jagan, call Money in AP

AP CM Chandrababu Naidu fearing about the opposition leader Jagan Mohan Reddy. Jagan questioning the govt agenda on call money

ITEMVIDEOS: ఆయనంటే చంద్రబాబుకు దడ

Posted: 12/18/2015 10:02 AM IST
Chandrababu naidu fearing about that leader

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడుకు ఓ వ్యక్తి దడపుట్టిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాలు చేసి.. చేసి.. తలపండిన బాబుగారికి తలనొప్పిగా మారాడు ఆయన. ఆయన మాట్లాడుతుంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాబు గారిని నిలదీస్తుండటంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది. కాల్ మనీ వ్యవహారంపై నడుస్తున్న తీవ్ర దుమారానికి చంద్రబాబు ఒక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాల్ మనీ వ్యవహారంపై ప్రభుత్వం సంజాయిషీ ఇవ్వలేక.. ప్రతిపక్షాల ప్రశ్నలకు తాళలేక తీవ్ర వత్తిడిలో ఉన్నారు బాబుగారు. ఇంతకీ ఇంతలా చంద్రబాబును ఇబ్బందిపెడుతున్న వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా..? ఇంకెవరు ప్రతిపక్షనాయకుడు వైయస్ జగన్.

ఏపి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఒక్కరిబిక్కిరి చేస్తూ.. ప్రతిపక్ష అంటే ప్రతి అంశాన్ని ప్రశ్నించడం అన్న దానిని నిజం చేస్తున్నారు జగన్. కాల్ మనీ వ్యవహారం మీద ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. ప్రతిపక్షాల వాదనలకు విలువనివ్వకుండా.. ఏకపక్షంగా సాగుతుండటం మీద కూడా జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. జగన్ వేస్తున్న ప్రశ్నలకు చంద్రబాబు అండ్ సర్కార్ ఇబ్బందిలో పడింది. కాల్ మనీ మీద అసలు చర్చను వదిలేసి.. కేవలం సిఎం స్టేట్ మెంట్ ఇస్తే.. దాని క్లారిఫికేషన్ మీద మాట్లాడటానికి మాత్రమే ప్రభుత్వ అవకాశం ఇవ్వడాన్ని జగన్ వ్యతిరేకించారు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తే ఎలా అని నిలదీస్తున్నారు జగన్.

జగన్ అసెంబ్లీలో ఇచ్చిన స్టేట్ మెంట్స్ ...
* ఐదు రోజులు ఎందుకు పెట్టారు..?
* మధ్యాహ్నం వరకే ఎందుకు సభ ఎందుకు పెట్టారు..?
* అంబేద్కర్ మీద చర్చించడానికి మరో రెండు రోజులు సభను పొడగించవచ్చు కదా..? అలా ఎందుకు చెయ్యడం లేదు..?
* ప్రతిపక్షాలు ఏం మాట్లాడాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందా..?
* పది నిమిషాలు మాట్లాడాలని ప్రభుత్వం అనడం ఏంటి..?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : call Money  AP  Chandrababu Naidu  Jagan  JaganMohanReddy  YS Jagan  call Money in AP  

Other Articles