పట్ట పగలు.. నిండు సభలో.. ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వాళ్లు తీరిగ్గా.. బ్లూ ఫిల్మ్ చూస్తూ కనిపించారు. ఒడిశా అసెంబ్లీ సాక్షిగా ఓ శాసనసభ్యుడు చేసిన నిర్వాకం మీద దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. ఒడిశా రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నబొదాస్ సభలో తన స్థానంలో కూర్చుని స్మార్ట్ ఫోన్ లో నీలి చిత్రాలు చూసినట్లు తెలుస్తోంది. దీంతో అధికార పక్ష బిజూ జనతాదళ్ (బీజేడీ) సభ్యులు ఆయనపై విరుచుకుపడ్డారు. బిజు జనతాదళ్ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రమీలా మల్లిక్ మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో పవిత్రమైన సభలో బ్లూ ఫిల్మ్ లు చూడటం నేరమని, దీనిపై దర్యాప్తు చేసి నబొదాస్ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేడీ శాసనసభ్యుడు అమర్ శత్పథి మాట్లాడుతూ ఈ సంఘటన సభ గౌరవానికి మాయని మచ్చ తెచ్చిందన్నారు.
Also Read: ‘హెల్ప్’ అంటూ పోలీసులను ఆశ్రయించిన పోర్న్-స్టార్
కాగా.. తనపై వచ్చిన ఆరోపణలపై నబొదాస్ మీడియాతో మాట్లాడుతూ.. స్మార్ట్-ఫోన్ వినియోగంపై తనకు అంతగా అవగాహన లేదని, కీలకమైన పత్రాలు చూసేందుకు నెట్ లోఅంతర్జాలంలో వెతుకుతుండగా పొరపాటున వేరే వెబ్ సైట్ లో ప్రవేశించడంతో బ్లూ ఫిల్మ్స్ కనిపించాయే తప్ప ఉద్దేశపూర్వకంగా తాను తప్పు చేయలేదని చెప్పారు. అవసరమైతే దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. శాసనసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నందున తనపై దుష్ప్రచారం చేస్తున్నారని నబొదాస్ ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more