More than 30 civilians killed in attack at Afghanistan's Kandahar airport

More than 30 civilians killed in attack at afghanistan s kandahar airport

Kandahar airport, Afghanistan, Afghan Defense Ministry, Terror Attacks, Attack on Kandahar Airport

Thirty-seven civilians were killed in an attack Tuesday night at a market bazaar and a school near Kandahar airport, Afghan officials said. Another 35 people were wounded, the Afghan Defense Ministry said. Nine terrorists were also killed, the ministry said. One was wounded, it said. The Taliban took responsibility for the attack.

కాందహార్ లో మారణకాండ.. 37 మంది మృతి

Posted: 12/10/2015 08:48 AM IST
More than 30 civilians killed in attack at afghanistan s kandahar airport

ఆఫ్ఘనిస్థాన్‌లోని కాందహార్ విమానాశ్రయం రణరంగంగా మారింది. 24 గంటలపాటు తాలిబన్లకు, ఆఫ్ఘన్ సైనికులకు మధ్య మొదలైన భీకర కాల్పుల్లో తొమ్మిదిమంది ఉగ్రవాదులు మృతిచెందగా, మరొక ఉగ్రవాది తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రవాదుల కాల్పుల్లో 37మంది ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందగా, మరో 35మంది గాయపడినట్టు రక్షణశాఖ పేర్కొంది. కాందహార్ ఎయిర్‌పోర్ట్ ప్రధాన ద్వారంవద్ద భద్రతా సిబ్బందిపై కాల్పులు జరుపుతూ లోనికి చొచ్చుకెళ్లిన తాలిబన్లు, ఓ పాత స్కూల్‌భవనాన్ని కేంద్రంగా చేసుకొని సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన ఆఫ్ఘన్ సైన్యం తాలిబన్లపై ఎదురుకాల్పులకు దిగింది. రాత్రంతా సైనికులకు, తిరుగుబాటుదారులకు మధ్య భీకార కాల్పులు జరిగాయి. అగంతకులు మనుషులను రక్షణకవచంగా ఏర్పాటు చేసుకొని సైనికులపై కాల్పులకు దిగటంతో వారిని ఎదుర్కోవడం కొద్దిగా కష్టమైనదని ఓ సైనికాధికారి వెల్లడించారు. ఈ కాల్పులకు తెగబడింది తామేనని తాలిబన్ ప్రకటించింది.

ఈ ఘటనలో దాదాపు 150మంది ఆప్ఘన్ పౌరులు, సైనికులు మృతిచెందినట్టు తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాలిబన్ల జన్మస్థలంగా పేరున్న కాందహార్ నగరం కొంతకాలంపాటు వారి ఆధీనంలోనే ఉన్నది. సుదీర్ఘకాలంగా బద్దశత్రువుగా ఉన్న పాకిస్థాన్‌లో జరుగుతున్న ఆసియా దేశాల ప్రాంతీయ సదస్సు హార్ట్ ఆఫ్ ఏషియా లో ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్‌ఘనీ పాల్గొనడాన్ని తాలిబన్లు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఘనీ పాక్ పర్యటనతో తిరుగుబాటుదారులతో శాంతి చర్చలు జరగవచ్చని తాలిబన్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాందహార్ విమానాశ్రయంపై దాడికి దిగినట్టు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles