Director Puri jaganath gave moral support to Amir Khan

Director puri jaganath gave moral support to amir khan

Amir Khan, Puri Jaganath, Amir Khan News, Intolerance, India, Puri, Puri Jaganath Tweets

Telugu sucessful director Puri Jaganath express his feeling on Amir Khan intolerance statements issue. He said that every one slaming Amir because he is a celebrity

అమీర్ ఖాన్ కు అండగా నిలుస్తున్న పూరీ జగన్నాథ్

Posted: 11/27/2015 04:50 PM IST
Director puri jaganath gave moral support to amir khan

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మీద దేశంలో పెద్ద దుమారమే నడుస్తోంది. అతడు చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర సంచలనమే రేపాయి. అయితే చాలా మంది అమీర్ ఖాన్ ను వ్యతిరేకిస్తుండగా కొంత మంది మాత్రం అతడికి అండగా ఉంటున్నారు. బాలీవుడ్ లోనే రెండు వర్గాలుగా విడిపోయే పరిస్థితి వచ్చింది. దేశంలో ఎక్కడా కూడా అసహనం పెరగలేదని,, ఇక్కడ భద్రత లేదని భావిసతే ఏ దేశానికైనా వెళ్లవచ్చునని కొన్ని సంస్థలు హెచ్చరించాయి. హిందు సేన అమీర్ ఖాన్ కు, అతడి కుటుంబం కోసం ఓ అడుగు ముందుకేసి పాకిస్థాన్ కు ప్లైట్ టికెట్లు బుక్ చేశారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర పూరి జగన్నాథ్ అమీర్ కు అనుకూలంగా నిలిచారు.


అమీర్ ఖాన్ మీద దేశవ్యాప్తంగా వస్తున్న నిరసన మీద టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మండిపడ్డారు. పనికిమాలినవాళ్లంతా ఆమిర్ ఖాన్ మీద మండిపడుతున్నారు.. దానికి కారణం అతను ఓ సెలబ్రిటీ కావడమే అని పూరీ మండిపడ్డారు. అదే ఆమీర్ కాన్ అల్ ఖైదాలోనో, ఐస్ఐఎస్ లోనో సభ్యుడై ఉంటే ఏ ఒక్క భారతీయుడికైనా ఇలాంటి నాన్ సెన్స్ క్రియేట్ చేయడానికి ధైర్యం ఉంటుందా? అంటూ ట్విట్టర్లో స్పందించారు. ఆమిర్ ఖాన్ బాధను ఎవరూ అర్థం చేసుకోవడంలేదని.. ప్రతి ఒక్కరు వివాదాలు సృష్టించడంలో బిజీగా ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు పూరీ. మొత్తానికి బాలీవుడ్ లోని వాళ్లే స్పందిస్తుండగా తాజాగా ఓ తెలుగు డైరెక్టర్ అమీర్ కు అండగా నిలుస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles