chintu planed to kill Mayor Anuradha thrice

Chintu planed to kill mayor anuradha thrice

Chintu, Mayor Anuradha, Anuradha Murder, Chittoor, Mayaor Murder, Chitu in Chittoor

Mayor Anuradha accused chitu tried to kill thrice in past. He planed to kill Mayor Anurahda and her husband Mohan. Police recently reveal Chintus murder plans

నాలుగో సారికి మేయర్ దంపతుల హత్య సక్సెస్

Posted: 11/23/2015 12:55 PM IST
Chintu planed to kill mayor anuradha thrice

చిత్తూరు మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. మోహన్ మేనల్లుడు చింటు రాయల్ అలియస: చంద్రశేఖర్ అంతకు ముందు కూడా చాలా సార్లు మేయర్ దంపతులను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడని.. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల అది సాథ్యపడలేదు. అయితే మేయర్ మీద హత్యాయత్నం చెయ్యడంలో చింటూ ఇప్పటికే చాలా సార్లు ప్లాన్ వేశాడని తేలింది. మోహన్ మేనల్లుడు చింటును అతడు కొంత కాలంగా దూరంగా ఉంచాడు. దాంతో ఇద్దరి మధ్య వివాదం పెరిగి.. చివరకు హత్య దాకా వెళ్లిందని సమాచారం. తాజాగా ఈ కేసులో చింటు వేసిన ప్లాన్ల తాలూకు విషయాలు బయటకు వచ్చాయి.

Also Read: కటారి మోహన్ మాట్లాడిన చివరి మాటలివే..!

చింటు అనురాధ దంపతుల మీద మూడు సార్లు అటాక్ కు ప్లాన్ వేశాడని.. కానీ మూడు సార్లు కూడా తమ ప్లాన్ సరిగ్గా వర్కవుట్ కాలేదని.. దాంతో నాలుగో సారి మేయర్ ను కార్పోరేషన్ వద్దే హతమార్చేందుకు ప్లాన్ వేశారు. అంతకు ముందు ఒకటి రెండు సార్లు మేయర్ హత్యకు ప్లాన్ వేసినా కానీ ఆ సందర్భంలో మోహన్ అనుచరులు, కార్యకర్తలు ఎక్కువగా ఉండటంతో కుదరలేదని తెలుస్తోంది. అలాగే తాజాగా హత్య చెయ్యడానికి వాడిన బురఖాలు రెండు నెలల క్రితం కొన్నవని కూడా పోలీసులు గుర్తించారు. మొత్తానికి గత రెండు రోజులుగా పోలీసులు విచారణను వేగవంతం చెయ్యడంతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chintu  Mayor Anuradha  Anuradha Murder  Chittoor  Mayaor Murder  Chitu in Chittoor  

Other Articles

Today on Telugu Wishesh