opposition party leaders making controversial comments on cm raman singh selfie with kareena kapoor | cm selfie with actress

Cm raman singh selfie with kareena kapoor went viral in politics

kareena kapoor news, cm raman singh news, raman singh controversies, raman singh latest updates, raman singh controversy, kareena kapoor news, kareena kapoor hot

cm raman singh selfie with kareena kapoor went viral in politics : opposition party leaders making controversial comments on cm raman singh selfie with kareena kapoor.

దుమారం రేపుతున్న హీరోయిన్తో సీఎం సెల్ఫీ..!

Posted: 11/21/2015 10:30 AM IST
Cm raman singh selfie with kareena kapoor went viral in politics

ప్రస్తుత రోజుల్లో ‘సెల్ఫీ’ పిచ్చి ఏ స్థాయిలో ముదిరిపోయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లల నుంచి ముసలివారు వరకు, చిన్న స్థాయి నుంచి ఉన్నత పదవిలో వున్నవారంతా దీని మోజులో మునిగి తేలుతున్నారు. అయితే.. ఈ సెల్ఫీ మోజు కొందరి ప్రాణాలను బలితీసుకుంటుండగా.. మరికొందరిని వివాదంలో పడేస్తున్నాయి. అలాగే.. ఓ హీరోయిన్ తో కలిసి సీఎం తీసుకున్న సెల్ఫీపై ఇప్పుడు పెద్ద దుమారమే చెలరేగింది. చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్(బీజేపీ) బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్తో సెల్పీ తీసుకోవడం వివాదాస్పదంగా మారింది.

చత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో బాలల హక్కుల కోసం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ వారు సంయుక్తంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీనాకపూర్ ప్రత్యేక అతిథిగా హాజరు కాగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఉత్తమ టీచర్లకు కరీనా, రమణ్ సింగ్లు అవార్డులు అందజేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రమణ్ సింగ్ నటి కరీనాతో సెల్ఫీ తీసుకుంటూ కెమెరాకు చిక్కారు. అంతే! ఎప్పుడెప్పుడు విమర్శలు చేద్దామా అని వెయిట్ చేస్తున్న విపక్ష పార్టీ నేతలకు ఈ సెల్ఫీ వ్యవహారం దొరికింది. ఇక వాళ్ళు తన చేతిలో మైకులు పట్టుకుని సీఎంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టేశారు. ‘సీఎం స్థాయిలో వుండి నటితో అలా వ్యవహించడం ఏంటి?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు.

రాష్ట్రంలో ఓ పక్క రైతుల ఆత్మహత్యల కొనసాగుతుంటే, వాటిని పట్టించుకోకుండా ఎంచక్కా సినీ తారలతో సెల్ఫీలు తీసుకుంటూ సీఎం బిజీగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. సీఎం చేయాల్సిన పని ఇదేనా అంటూ ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల అంశాలను పట్టించుకోకుండా సినీ తారలతో ముఖ్యమంత్రి సెల్ఫీలు దిగడమేంటని కాంగ్రెస్ చీఫ్ భూపేష్ బాగెల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మరి.. ఈ కామెంట్లపై సీఎం రమణ్ సింగ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kareena kapoor  cm raman singh selfie  

Other Articles