Delhi Student got a job with one crore twenty seven lakh package from google

Delhi student got a job with one crore twenty seven lakh package from google

Chetan Kakkar, Google, Job, Delhi Technological Universitystudent Chetan, Delhi Technological University, Delhi Student got job in Google, Google, Job in Google

Delhi Technological University student Chetan kakkar got a job with high package. Google offers one crore twenty seven lakh package for Chetan Kakkar.

దిల్లీ స్టూడెంట్ కు 1.27 కోట్ల ప్యాకేజ్ తో జాబ్

Posted: 11/20/2015 03:51 PM IST
Delhi student got a job with one crore twenty seven lakh package from google

ఢిల్లీ టెక్నాలజికల్‌ యూనివర్సిటీ విద్యార్థి చేతన్‌ కక్కర్‌కు గూగుల్‌ 1.27 కోట్ల ఆఫర్‌ చేసింది. ఢిల్లీ విద్యార్ధి చేతన్‌ కక్కర్‌ రికార్డు సృష్టించాడు. ఇంటర్నేషనల్‌ ప్లేస్‌మెంట్‌లో ఢిల్లీ టెక్నాలజీకల్‌ యూనివర్సిటీ విద్యార్థి చేతన్‌ కక్కర్‌ ఎంపికయ్యారు. ఢిల్లీ క్యాంప్‌ ఇంటర్వ్యూలో విద్యార్థి కక్కర్‌ను గూగుల్‌ ఎంపిక చేసింది. ఈ విద్యార్థి ఏడాది వేతనం 1.27 కోట్లుగా గూగుల్‌ నిర్ణయించింది. గతంలో ఇదే యూనివర్సిటికి చెందిన ఓ విద్యార్థికి 94 లక్షల సాలరీతో జాబ్ వచ్చింది. గత రికార్డులను తిరగరాస్తూ.. చేతన్ కక్కర్ ఏకంగా కోటి ఇరవై ఏడు కోట్ల సాలరీని అందుకుంటున్నారు.

చేతన్‌ కక్కర్‌ తల్లిదండ్రులు ఢిల్లీ యూనివర్సిటీలో టీచర్లుగా పనిచేస్తున్నారు. తల్లి రీతా కక్కర్‌ కెమిస్ట్రీ విభాగంలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. తండ్రి సుభాష్‌ కక్కర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగంలో టీచర్‌గా పని చేస్తున్నారు. ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీలో విద్యార్థి చేతన్‌ కక్కర్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీలో ఫైనల్‌ సంవత్సరం చదువుతున్నాడు. చేతన్‌ కక్కర్‌ గూగుల్‌ సంస్థలో ఉద్యోగంలో చేరనున్నాడు. 2016లో చేతన్‌ కక్కర్‌ చదువు పూర్తి కానుంది.తాను చేయబోయే ఉద్యోగం మీద ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్నట్లు చేతన్ కక్కర్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles