ISIS Warning to Washington

Isis warning to washington

ISIS, Warning from ISIS, ISIS Terrorists, terrorists, paris, France, Washington, London, Attack on washington

A chilling new ISIS video has warned of further Paris-style attacks on countries taking part in bombing Syria. In the footage, the terror group also specifically threatens to 'strike' Washington DC due to America's central role in airstrikes.

వాషింగ్టన్ మీద దాడి: ఐఎస్ హెచ్చరిక

Posted: 11/17/2015 12:24 PM IST
Isis warning to washington

ఐసిస్ ఉగ్రవాదులు దాడులకు మరింతగా తెగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఓ వీడియోలో ఉగ్రవాదులు మరిన్న దాడులకు పాల్పడనున్నట్లు వెల్లడించారు. వుడి తరఫున జరుగుతున్న మతయుద్ధంలోకి దిగేదేశాలకు మేం చెబుతున్నదిదే. పారిస్‌ మాదిరిగా మీ గురించి దేవుడు తలచుకునే రోజు మీకూ వస్తుంది. ఇప్పటికే పారిస్‌ నడిబొడ్డున దాడి చేశాం. ఇక అమెరికా రాజధాని వాషింగ్టన్‌ నడిబొడ్డునా దాడికి కట్టుబడ్డాం అని ఓ వ్యక్తి హెచ్చరిస్తున్న వీడియోను ఐఎస్‌ విడుదల చేసింది. అతడి పేరు ‘అల్‌ ఘరీబ్‌ ద అల్జీరియన్‌’గా స్ర్కోలింగ్‌లో కనిపించింది.

Also Read: ఆ ఎంపీ కొడుకు.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంలో చేరాడు..

కాగా పారిస్‌లో నరమేధం సృష్టించిన ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ఫ్రాన్స్‌తోపాటు యూరోప్‌లోని ఇతర దేశాల్లోనూ తీవ్రదాడులకు సిద్ధమవుతున్నారని ఫ్రాన్స్‌ ప్రధాని మాన్యుయెల్‌ వాల్స్‌ వెల్లడించారు.  పారిస్‌ లాంటి దాడులు ఇకముందు ఏ దేశంలోనైనా జరగొచ్చని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కేమరూన్ వెల్లడించారు. సిరియాలోని బ్రిటన్‌ పౌరులను ఉగ్రవాదులుగా మారుస్తూ, దాడులకు పంపుతున్న ఉదంతాలనూ తమ నిఘావర్గాలు పసిగడుతు న్నాయని చెప్పారు. పారిస్‌లాంటి మరిన్ని దాడులకు ఐఎస్‌ వ్యూహం పన్నినట్లు అ మెరికా నిఘాసంస్థ సీఐఏ డైరెక్టర్‌ జాన్‌బ్రెన్నన్‌ హెచ్చరించారు. అన్ని దేశాలు ఉమ్మడిగా ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టాల్సిన అవసరం ఉందని జి20 సమావేశంలో అన్ని దేశాల అధినేతలు తీర్మానం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  Warning from ISIS  ISIS Terrorists  terrorists  paris  France  Washington  London  Attack on washington  

Other Articles