after singer madhupriya got married with srikanth her mother expressed her feelings on her daughter's future life | madhupriya controversy

Singer madhupriya mother sujatha expressed their feelings

singer madhupriya, madhupriya marriage, madhu priya updates, madhu priya marriage controversy, madhu priya mother sujatha, madhu priya with srikanth

singer madhupriya mother sujatha expressed their feelings : after singer madhupriya got married with srikanth her mother expressed her feelings on her daughter's future life.

తల్లి రోదన.. కూతురి ఆవేదన..

Posted: 11/10/2015 10:37 AM IST
Singer madhupriya mother sujatha expressed their feelings

రాష్ట్రవ్యప్తంగా సంచలనం సృష్టించిన వర్తమాన సింగర్ మధుప్రియ వివాహం తర్వాత అన్ని పరిస్థితులు చక్కదిద్దుకుంటాయని అంతా భావించారు కానీ.. అలాంటి పరిణామాలు కనిపించడం లేదు. తమ కూతురు మోసపోయిందంటూ తల్లి రోధిస్తుంటే.. తానేమీ మోసపోలేదంటూ కూతురు వివరణ ఇస్తోంది. ఇప్పటికీ వీరి మధ్య విభేదాలు కొనసాగుతూనే వున్నాయి.

తమ కూతురు చాలా అమాయకురాలని, ఆమె ఎక్కడో అన్యాయానికి గురైందని, ఆ విషయం ఏంటో తెలియాలంటే తల్లి సుజాత ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏ విషయం దాచని తమ కూతురు.. ఎలాంటి కష్ట సమయంలో ఈ పెళ్లికి తలవంచిందో అంతుపట్టడం లేదని భయాందోళనలకు గురవుతున్నారు. మధు భవిష్యత్తు ఏమవుతుందోనని బెంగపడుతున్నారు. తన భవిష్యత్తు బాగుండాలని ఎన్నో కష్టాలు పడితే.. మధు తమ గుండెల మీద తన్ని వెళ్లిందని సుజాత మనస్తాపంతో బాధను వెళ్లగక్కుతున్నారు. ఈ పెళ్లిలో ఏదో రహస్యం దాగివుంది. ‘తను ఏరి కోరి ఆ అబ్బాయిని ఎంచుకోలేదు. ఏదో జరిగింది. అదే బయటకు రావడం లేదు. తను అంతగా ఇష్టపడి ఉండి ఉంటే.. మాకు నిజాలు చెప్పి ఉంటే.. కాళ్లు కడిగి నెత్తిన చల్లుకునేవాళ్లం. చుట్టాలను పిలిచి వేడుకగా పెళ్లి చేసేవాళ్లం’ అని ఆమె వెల్లడిస్తున్నారు. మధుప్రియ చేసిన పనికి సమాజంలో తాము తలెత్తుకోలేకపోతున్నామని, ధైర్యంలేనివారయ్యామని అంటున్నారు. ఏదేమైనా.. మధుప్రియకు ఏ కష్టమొచ్చినా తనని కాపాడ్డానికి తామున్నామని, ధైర్యంగా బతుకు అంటూ సుజాత దీవిస్తున్నారు.

అటు మధుప్రియ మాట్లాడుతూ.. తానేమీ మోసపోలేదని, పెళ్లైన తర్వాత తన అత్తారింట్లో చాలా సంతోషంగా వున్నానంటూ వివరిస్తోంది. శ్రీకాంత్ తాముండే ప్రాంతంలోనే వుండేవాడని, రెండేళ్ల సుదీర్ఘ పరిచయం వుందని, కుటుంబసభ్యులు ఎంతో మంచివారంటూ చెబుతోంది. మంచి కుటుంబం అని తెలుసుకున్న తర్వాతే శ్రీకాంత్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నానని అంటోంది. శ్రీకాంత్ పేదవాడు కావడంతో అమ్మనాన్నకు నచ్చలేదని, ఆ విషయంపై తనకు నచ్చజెప్పాలని ప్రయత్నించారని అంటున్న మధుప్రియా.. ఇంకొన్నేళ్లు ఆగితే తల్లిదండ్రులు తన మనస్సు మార్చే ప్రయత్నం చేస్తారని ఏమీ ఆలోచించకుండా శ్రీకాంత్ ని పెళ్లి చేసుకుంటున్నట్లు వెల్లడిస్తోంది. ‘అమ్మానాన్న అనుకున్నట్టుగా నన్నెవరూ మోసం చేయలేదు. శ్రీకాంత్, నేను పర్సనల్‌గా మా భవిష్యత్తు గురించి చర్చించుకున్నాం. పెళ్లికి రమ్మని అమ్మానాన్నలను చాలా రిక్వెస్ట్ చేశాను. కానీ, వాళ్లు రాలేదు’ అని మధు అంటోంది. అమ్మానాన్నలు తమకు యాక్సెప్ట్ చేస్తారని మధుప్రియ నమ్మకం వ్యక్తం చేసింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : singer madhu priya marriage  madhu priya family members  

Other Articles