మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడనే విషయాన్ని మరోమారు విద్యాధికుడుకాని ఓ వ్యక్తి నిరూపించాడు. పైగా అతడు మాట్లాడలేడు, వినలేడు కూడా. ఇన్నీ సమస్యలున్నప్పటికీ జీవితంపై ఓటమిని ఏమాత్రం అంగీకరించిన ఆయన.. తన మేధోశక్తితో ఓ మహాద్భుతాన్నే సృష్టించాడు. నేటి యువతకు మార్గదర్శకంగా నిలిచాడు.
అతని పేరు సాజి ధామస్.. 45 ఏళ్ల ఈయన కేరళ రాష్ట్రం, ఇదుక్కి జిల్లాలోని తొడుప్పుజాలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అతను చదువుకున్నది మాత్రం 7వ తరగతి. అయితేనేం.. ఓ ఇంజనీర్ కి మించిన మేధోశక్తి ఆయనలో వుందని చిన్న ‘ఎయిర్ క్రాఫ్ట్’ను తయారుచేసి నిరూపించాడు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. అతను మాట్లాడలేడు, వినలేడు. చదువు మానేసిన అనంతరం సాజి ఎలక్ట్రిక్ పనులు చేస్తూ వచ్చాడు. అందులో బాగా ప్రావీణ్యం పొందిన అనంతరం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించాడు. అదే ఆయనకు ఎయిర్ క్రాఫ్ట్ తయారుచేసేలా ప్రేరణ కలిగించింది. తాను నిర్ణయం తీసుకున్న మరుక్షణమే ఆ పనుల్లో నిమగ్నమైపోయాడు. చివరికి లక్ష్యాన్ని సాధించి, తన సత్తా చాటుకున్నాడు. అయితే, ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేసేందుకు అవసరమైన ఖర్చు అంతా సాజి సొంతగానే భరించాడు. అందుకుగాను తనకున్న భూమిని కొంత అమ్మివేశాడు. ఇతను తయారుచేసిన ఎయిర్ క్రాఫ్టులో ఇద్దరూ కూర్చోవచ్చు. ఇది 20 అడుగుల ఎత్తులో ఎగరగల్గుతుంది. మధురైకు సమీపంలోని అంబసముద్రంలో ఉన్న ఒక ప్రయివేట్ ఎయిర్ లైన్స్ అకాడమీకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ను ఇచ్చివేశాడు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ కు సంబంధించిన కార్యక్రమాన్ని డిస్కవరీ ఛానెల్ లో ప్రసారం చేశారు కూడా.
ఈ సందర్భంగా అతని భార్య మారియా మాట్లాడుతూ... ‘మాకు వివాహమై 14 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి ఆయన చాలా బిజీగా ఉండేవారు. చిన్న చిన్న మోటార్లు, మిషన్లకు సంబంధించిన పనులతో తీరికలేకుండా గడిపేవారు. ఆయనను వాటి జోలికి వెళ్లకుండా నేను చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. ఇక లాభం లేదని భావించి, ఆయన చేసే ప్రతి పనికి నేను సహాయపడేదానిని. మొదట్లో ఆయన హెలికాఫ్టర్ తయారు చేయాలనుకున్నారు. హెలికాఫ్టర్ ఇంజన్ కొనుగోలుకు డబ్బు అవసరం కనుక, ఏకంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతోనే ఆయన టచ్ లో ఉండేవాడు. అయితే, రాజీవ్ గాంధీ హత్యకు గురవడంతోనే సాజి కోరిక నెరవేరలేదు. దీంతో ఒక ఎయిర్ క్రాఫ్టును తయారు చేయాలని ఆయన అనుకున్నాడు. ఐదేళ్ల శ్రమ అనంతరం గత ఏడాది ఏప్రిల్ లో ఈ చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేశాడు’ అని చెప్పింది. తన భర్తకు స్థిరమైన ఒక ఉద్యోగాన్ని చూపించాలని, ప్రభుత్వం తమకు మద్దతుగా నిలవాలని మారియా, ఆమె కొడుకు జోషువా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సాజి స్థానికుల సహాయంతో రెండు గదుల ఇల్లును నిర్మించుకుని తన భార్యబిడ్డలతో నివాసం వుంటున్నాడు.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more