ap bus charges hike creates new controversy between two telugu states | telugu states controversies

Rtc controversy between two telugu states

telugu states, ap bus charges hike, telangana bus charges hike, ap telangana rtc controversy, hyderabad vijayawada busses, vijayawada bus stand

rtc controversy between two telugu states : ap bus charges hike creates new controversy between two telugu states.

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి ‘ఆర్టీసీ’ చిచ్చు

Posted: 11/03/2015 10:43 AM IST
Rtc controversy between two telugu states

విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏదో ఒక విషయమే వివాదం రేగుతూనే వుంది. అందులో ముఖ్యంగా ‘ఆర్టీసీ’ వ్యవహారం పెద్ద సమస్యగా మారిపోయింది. ఇదివరకే ఆర్టీసీకి సంబంధించి ఓ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తగా.. ఇప్పుడు తాజాగా మరో వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు గల కారణం ఏమిటంటే.. ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచగా.. తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలు మాత్రం యధాతథంగానే వున్నాయి. దీంతో.. మరో వివాదం చెలరేగింది.

విజయవాడ-హైదరాబాద్ మధ్య ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ బస్సు టికెట్ ధరల్లో భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఏపీ-తెలంగాణ మధ్య ప్రయాణించే అన్ని రూట్లల్లోనూ ఇదే తీరు. దీంతో ప్రయాణికులు తెలంగాణ బస్సులు ఎక్కేందుకే ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణ బస్సు నడిచే సమయానికి ముందు-వెనక తిరిగే ఏపీ బస్సుల్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. ఇది ఆక్యుపెన్సీ రేషియోపై ప్రభావం చూపుతోంది. దీంతో కీలక వేళల్లో తెలంగాణ బస్సులను ప్లాట్‌ఫాం వద్దకు రాకుండా కొన్నిచోట్ల ఏపీ కండక్టర్లు అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా.. విజయవాడ బస్టాండులో హైదరాబాద్‌కు వెళ్లాల్సిన తెలంగాణ ఆర్టీసీ బస్సు ప్లాట్‌ఫారం వద్దకు రాకముందే వాటిని ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్లు అడ్డుకున్నారు. రెండు ఏపీ బస్సులు బయలుదేరాకే ఫ్లాట్‌ఫారం వద్దకు రావాలని ఆర్డర్ వేస్తున్నారు. రోజూ నిలిపే సమయమే కదా అడ్డుకోవడమేంటని టీఎస్ ఆర్టీసీ కండక్టర్ ప్రశ్నిస్తే.. ‘మీ బస్సు వస్తే ప్రయాణికులు ఎగబడి ఎక్కేస్తారు, మా బస్సుల  ప్రయాణికుల సంఖ్య పడిపోతుంది.’ అంటూ ఏపీ కండక్టర్లు ఎదురుదాడికి దిగతున్నారు. దీంతో గత్యంతరం లేక తెలంగాణ బస్సులను ఏపీ బస్సులకు వెనుక నిలబెడుతున్నారు. అయితే.. తెలంగాణ బస్సు కండక్టర్లు ప్లాట్‌ఫాం వద్దకు వెళ్లి.. ‘తెలంగాణ బస్సు వెనక ఉంది.. వచ్చి కూర్చోండి.. టికెట్ ధర కూడా తక్కువ’ అంటూ కేకలు వేస్తూ ప్రయాణికులను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఏపీ ఆర్టీసీ కండక్టర్లు వారితో వాదనకు దిగుతున్నారు.

ఒకే రూట్‌లో ప్రయాణించే వేర్వేరు రాష్ట్రాల బస్సు చార్జీలు ఒకేలా ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని, తెలంగాణలో కూడా బస్సు చార్జీలు సవరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఏపీ అధికారులు తెలంగాణ అధికారులను కోరుతున్నారు. లేని పక్షంలో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఒప్పందం ఉంటే ఏ ఆర్టీసీ బస్సులోనైనా, ఏ రాష్ట్ర భాగంలో ఆ రాష్ట్ర చార్జీని అమలు చేస్తారు. తెలంగాణ భూభాగంలో రెండు ఆర్టీసీలు తెలంగాణ చార్జీని, ఏపీ భూభాగంలో రెండు ఆర్టీసీ బస్సుల్లో ఏపీ చార్జీలను అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, సాంకేతికంగా ఇంకా రెండు ఆర్టీసీలు విడిపోకపోవటం ఈ ఒప్పందానికి అడ్డొస్తోంది. మరి.. ఈ వివాదం ఎన్నాళ్ల వరకు రాజుకుంటుందో, ఎన్ని సమస్యల్ని తీసుకొస్తుందో వేచి చూడాల్సిందే.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rtc controversy  telugu states  

Other Articles