Congress party gearup in warangal elections

Congress party gearup in warangal elections

Warangal, Elections, Congress, Rajaiah, TRS, Warangal Elections, Congress Party

Congress party trying to get victory in the Warangal BiElections. Congress party gave ticket to Rajaiah. Congress party working together for sucess in the eelctions

వరంగల్ లో టాప్ గేర్ లో కాంగ్రెస్ పార్టీ

Posted: 11/03/2015 09:37 AM IST
Congress party gearup in warangal elections

వరంగల్ ఉప పోరుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. రాజయ్య గెలుపే లక్ష్యంగా సీనియర్లంతా ప్రచారానికి రెడీ అయ్యారు. దిగువ స్థాయి శ్రేణులను కూడా ప్రచారంలో భాగస్వాములు చేసేలా సరికొత్త కార్యాచరణతో రంగలోకి దిగుతున్నారు. సినీ తారలతో ప్రచారం గురించి కూడా ఆలోచిస్తున్నారు. వరంగల్ ఉప ఎన్నికలో ఎలాగైనా గెలిచి టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా నిర్ణయించుకుంది. అభ్యర్థి ఎంపీకలో ఆచితూచి వ్యవహరించిన హస్తం పార్టీ.. సిరిసిల్ల రాజయ్యను రంగంలోకి దింపింది. బేధాభిప్రాయాలు పక్కన పెట్టి, గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని నిర్ణయించారు టీపీసీసీ నేతలు. జైపాల్ రెడ్డి, జానారెడ్డి లాంటి సీనియర్లు సైతం ప్రచారంలో పాలుపంచుకొనున్నారు. ఇందుకోసం గాంధీభవన్ లో సుమారు మూడు గంటలకు పైగా చర్చించారు. వరంగల్ లో విజయం కోసం ఏమేమి చెయ్యాలో ఆలోచించారు. రాహుల్ దూతగా వచ్చిన కొప్పుల రాజుకు తమ అభిప్రాయాలను వివరించారు.

వరంగల్ ప్రచారంలో... సీనియర్ నేతలకు నియోజకవర్గాల వారిగా బాధ్యతలు అప్పగించింది టిపిసిసి. భూపాలపల్లి నియోజక వర్గానికి జానారెడ్డి, వర్ధన్నపేటకు భట్టి విక్రమార్క, వరంగల్ ఈస్ట్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ వెస్ట్ కు షబ్బీర్ అలీ, పరకాలకు జీవన్ రెడ్డిని ఇంచార్జ్ లు్గా నియమించారు. మండల స్థాయిలో కూడా ఇంచార్జ్లను నియమించారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉండే ఏడు నియోజకవర్గాల వారిగా బహిరంగ సభలు, పాదయాత్రలు నిర్వహించి, టీఆర్ ఎస్ కు దీటుగా ప్రచారం చెయ్యాలని నిర్ణయించారు. ఆరు, ఏడూ తేదిల్లో జెండా పండుగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తన ఇంటి పై పార్టీ జెండా ఎగురవెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. 8 నుంచి 14 వరకు డోర్ టూ డోర్ ప్రచారం తో పాటు, 15 నుంచి 19 వరకు నియోజక వర్గాల్లో బహిరంగా సభలు నిర్వహిస్తారు. ఇప్పడికే ఓరుగల్లులో ప్రచారానికి 40మందితో స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ ను కాంగ్రెస్ ప్రకటించింది. మరి ఈ హస్తం నేతల కష్టం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Warangal  Elections  Congress  Rajaiah  TRS  Warangal Elections  Congress Party  

Other Articles