Congress chooses Rajaiah as the candidate

Telugu content

Congress, Rajaiah, Warangal, Elections, Warangal Elections, Congress party candidate in warangal

After several discussions held by the Congress party, Rajaiah has been selected as the candidate to contest for the Warangal Lok Sabha seat in the by-elections. Former MP and Congress leader Vivek was earlier said to be the one in contention to be the nominee but as the leader declined to contest, local leader and former MP Rajaiah was chosen.

వరంగల్ బరిలో కాంగ్రెస్ నుండి రాజయ్య

Posted: 10/31/2015 05:20 PM IST
Telugu content

వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా మళ్లీ సిరిసిల్ల రాజయ్యకే అవకాశం దక్కింది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్థిని ఇవాళ ఏఐసీసీ ప్రకటించింది. తమ పార్టీ తరపున మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య పేరును ఖరారు చేసింది. గతంలో వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసిన రాజయ్య డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. కడియం శ్రీహరి వరంగల్ లోక్‌సభకు రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక తప్పనిసరి అయింది.

2009 నుండి 2014 వరకు వరంగల్ ఎంపీగా రాజయ్య పని చేశారు. గత లోకసభ ఎన్నికల్లో మూడు లక్షల తొంభైఆరువేల ఓట్లతో కడియం శ్రీహరి చేతిలో ఓడిపోయారు. ఎస్సీ కులానికి చెందిన రాజయ్య ఎన్జీరంగా యూనివర్సిటి నుండి అగ్రికల్చర్ బిఎస్సీ చేశారు. రాజయ్యకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. రాజయ్య పేరును ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది దిల్లీలో ప్రకటన చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles