Modi covers two big personalities

Modi covers two big personalities

Rashtriya Ekta Diwas, Sardar Vallabhbhai Patel, Run For Unity, Rajpath, PM Modi, Sardar Patel, PM attacks Congress, dynastic politics, Modi

Prime Minister Narendra Modi today flagged off the 'Run For Unity' in New Delhi to mark the 140th birth anniversary of Sardar Vallabhbhai Patel, and urged people to take inspiration from his life and work for the country's unity and integrity. "Unity is our biggest strength," he said addressing the crowds that had gathered at Rajpath, and asserted that unity, peace and harmony were the "mantra" to attain new heights of development.

మోదీ అలా ఇద్దరినీ కవర్ చేశాడు

Posted: 10/31/2015 12:09 PM IST
Modi covers two big personalities

భారత ప్రధాని నరేంద్ర మోదీ  చాణిక్య నీతి గురించి దేశం మొత్తం తెలుసు. సార్వత్రిక ఎన్నికల్లో తన పేరునే మంత్రంగా దేశం మొత్తం పఠించేలా చెయ్యడం ఒక్క మోదీకే సాధ్యపడింది. తాజాగా జాతీయ ఐక్యతా దినోత్సవం ప్రసంగంలోనూ తన మార్క్ ను చూపించారు. దేశానికి ఎంతో సేవ చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మోదీ వేనోళ్ల కీర్తించారు. దేశాన్ని ఐక్యం చేసిన ఒకే ఒక్క నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రమే అని అన్నారు. పటేల్ ఏ కుటంబాన్ని రాజకీయంగా సపోర్ట్ చెయ్యలేదని పరోక్షంగా కాంగ్రెస్ ను ఉద్దేశించి అన్నారు. అలాగే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేశం సమగ్రంగా ఉంది అంటే దానికి పటేల్ చేసిన విశేష కృషి కారణం అంటూ పొగిడారు.

దేశానికి సమైక్యమే బలం అని మోదీ వివరించారు. ఒక్కసారి 125 కోట్ల భారతీయులు దేశం కోసం సమైక్యంగా ముందుకు కదిలితే.. దేశం 125 కోట్ల అడుగులు ముదుకు వెళుతుందని మోదీ వెల్లడించారు. దేశానికి సమైక్యతనే బలం అని పటేల్ మనకు అందించిన సందేశం అని మోదీ వివరించారు. పటేల్ గురించి మాట్లాడిన మోదీ.. చివర్లో ఇందిరాగాంధీని కూడా ప్రస్తావించారు. దేశ రాజకీయాల్లో తన ముద్రను వేసిన ఇందిరా గాంధీ నింగికేగిన రోజు కూడా ఇదే అని.. అది తాను మరిపోలేనని అన్నారు. మొత్తానికి ఎన్డీయే బ్రాండ్ అండాసిడర్ గా సర్దార్ పటేల్ ను చెబుతూనే.. ఇందిరా గాంధీని ప్రస్తావించారు మోదీ. ఇలా ఇద్దరు భిన్న నేపధ్యాలు ఉన్న నాయకులను ఒకే సారి కవర్ చెయ్యడం మోదీకే చెల్లింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles