Imran Khan and ex-BBC presenter wife Reham Khan divorce after just 10 months | former pakistan cricketer imran

Imran khan given divorced his second wife reham khan

imran khan, reham khan, imran khan divorce news, imran khan reham khan divorce, divorce latest updates, imran khan controversy, imran khan news, pakistan former cricketer imran khan

imran khan given divorced his second wife reham khan : Imran Khan, the Pakistani politician and former cricket star, and his wife, Reham Khan, an ex-BBC presenter, have parted ways after less than 10 months of marriage.

రెండో భార్యకు విడాకులిచ్చిన మాజీ క్రికెటర్

Posted: 10/30/2015 04:24 PM IST
Imran khan given divorced his second wife reham khan

నేటి యుగంలో పాంప్లెట్లు పంచినట్లు విడాకులు తీసేసుకుంటున్నాయి జంటలు. పెద్దల సమక్షంలో సంస్కృతీ-సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుని జన్మజన్మలకు కలిసుంటామని హామీలిచ్చే జంటలు.. వాటిని పూర్తిగా మరిచిపోయి కేవలం చిన్నచిన్న కారణాలతో విడిపోతున్నారు. ఒకసారి అయితే ఏమో అనుకోవచ్చు కానీ.. బట్టలు మార్చేసినట్లుగా తమ భాగస్వామ్యుల్ని మార్చేస్తున్నారు. ఇలాంటివారికి ఎన్ని సలహాలు ఇచ్చినా.. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ పంథా తమదే అన్నట్లు దూసుకపోతుంటారు. ఇలాంటివారి జాబితాల్లోకి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ చేరిపోయాడని చెప్పుకోవడంలో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే.. ఇప్పటికే మొదటి భార్యకు విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్.. ఇప్పుడు ఆమెక్కూడా విడాకులిచ్చేశాడు. ఎందుకో తెలుసుకోవాలంటే మేటర్ లోకి వెళ్ళాల్సిందే!

మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత అయిన ఇమ్రాన్ ఖాన్.. తన 10 నెలల వైవాహిక జీవితం అనంతరం రెహమ్ ఖాన్ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఈ విషయాన్ని పీటీఐ అధికార ప్రతినిధి నయిమూల్ హక్  ధృవీకరించారు. వీరిద్దరూ పరస్పర అంగీకారం మేరకు విడాకులు తీసుకున్నట్లు ఇమ్రాన్ అధికార ఫేస్ బుక్ లో తెలియజేశారు. గత జనవరిలో బీబీసీలో ప్రసారమయ్యే 'సౌత్ టుడే' అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా పని చేసిన రెహమ్ ఖాన్ ను ఇమ్రాన్ వివాహం చేసుకున్న సంగత తెలిసిందే. ఆమెకు గతంలో పెళ్లయి.. ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే.. విభేదాల కారణంగా ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసింది. అంతకుముందు జెమీమా ఖాన్ను పెళ్లి చేసుకున్న ఇమ్రాన్.. ఆమెకు 2004లోనే వలిడాకులు ఇచ్చేశాడు. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులున్నారు. ఇలా తమతమ మొదటి భాగస్వామ్యులు వదిలేసిన వీరిద్దరూ.. 10 నెలల క్రితం ఒక్కటయ్యారు. తమ రెండో ఇన్నింగ్స్ ని తొలినాళ్లలో సంతోషంగా గడిపిన వీరిద్దరి మధ్య ఓ వ్యవహారంపై విభేదం ఏర్పడింది.

పాకిస్తాన్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన రెహమ్ కూడా రాజకీయాల్లోకి వస్తానని తన భర్త ఇమ్రాన్ ముందు ప్రతిపాదన పెట్టిందట. అందుకు మనస్తాపానికి గురైన ఇమ్రాన్.. ససెమిరా అన్నాడు. అయినప్పటికీ తాను పాలిటిక్స్ లో ఎంట్రీ ఇస్తానని మొండికేయడంతో ఆమెకు ఇమ్రాన్ తలాఖ్ చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ తమ తలాఖ్ గురించి స్పందిస్తూ.. ఇది తనతో పాటు, ఆమె కుటుంబానికి కూడా అత్యంత బాధ కల్గించే విషయమన్నాడు. తమ స్వేచ్ఛలో భాగంగానే విడాకులు తీసుకున్నట్లు తెలిపాడు. తమ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తానని తాను కోరుకుంటున్నట్లు తెలిపాడు. అటు రెహమ్ కూడా ఇదే విషయాన్ని సామాజిక మాధ్యమంలో వెల్లడించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : imran khan  reham khan  pakistan  

Other Articles