madhupriya fell in love with srikanth when they both worked together for short films | singer madhupriya love controversy

Madhupriya fell in love with srikanth during short film shoot

singer madhupriya, madhupriya love controversy, madhupriya srikanth love affair, madhupriya marriage, singer madhupriya marriage, madhupriya love affairs, madhupriya srikanth, madhupriya srikanth marriage

madhupriya fell in love with srikanth during short film shoot : madhupriya fell in love with srikanth when they both worked together for short films.

షార్ట్ ఫిల్మ్స్ తో ఆ సింగర్ ని బుట్టలో వేసుకున్నాడట!

Posted: 10/30/2015 10:49 AM IST
Madhupriya fell in love with srikanth during short film shoot

‘ఆడపిల్లనమ్మా’.. అనే పాటతో గాయనిగా పేరుగాంచిన మధుప్రియ ప్రేమ వ్యవహారం రచ్చరచ్చగా మారింది. ఆమె ప్రేమించిన శ్రీకాంత్ కుటుంబసభ్యులు వీరి పెళ్లికి సుముఖత వ్యక్తం చేయడంతో కార్డులు సైతం పంచేయగా.. మధుప్రియ తల్లిదండ్రులు మాత్రం ఈ పెళ్లికి ససేమిరా అంటున్నారు. ఇప్పటికే వీరి పెళ్లిని ఎలాగోలా ఆపేందుకు వాళ్ళవైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్లోంది.

ఇదిలావుండగా.. మధుప్రియ ప్రేమించిన శ్రీకాంత్ గురించి ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని కొందరు చెబితే, రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని మరికొందరు చెబుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం షార్ట్ ఫిలింలు డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకునేందుకు శ్రీకాంత్ గతకొద్దికాలం నుంచి షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ వస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఇలా షార్ట్ ఫిలింలు తీసే క్రమంలోనే శ్రీకాంత్ రెండు మూడు షార్ట్ ఫిలింలలో మధుప్రియకు అవకాశం ఇచ్చాడట. ఆ షార్ట్ ఫిల్మ్స్ షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతున్నారు. ఇప్పుడా ప్రేమ పెళ్లిదాకా చేరింది కానీ.. గందరగోళంగా సాగుతోంది.

హైదరాబాద్ నల్లకుంట ప్రాంతంలో మధుప్రియ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ సమీపంలోనే శ్రీకాంత్ కూడా ఉండేవాడని, అప్పుడే ఇద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది. గత రెండేళ్ల నుంచి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. నెల రోజుల క్రితమే ఆమె మేజర్ కావడంతో, ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబసభ్యులకు తమ ప్రేమ వ్యవహారాన్ని తెలిపారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించగా.. మదుప్రియ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోవడం లేదు. కాగా మధుప్రియ తన తల్లిదండ్రులు తమ ప్రేమ పెళ్లికి అంగీకరించారని తెలిపింది.

మరోవైపు.. మధుప్రియ ప్రేమ పెళ్లికి మద్దతుగా కొందరు అభిప్రాయాల్ని వెల్లడిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. 18 సంవత్సరాలపాటు ఎంతో ఆప్యాయంగా ప్రేమతో పోషించి పెద్ద చేసిన తల్లిదండ్రుల్ని కాదనుకుని, 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madhupriya srikanth  singer madhupriya love affair  

Other Articles