cm kcr go to amaravathi inauguration on helicopter

Kcr arrives at amaravathi in special chopper

ap capital amaravati, amaravathi land breaking occasion, pm narendra modi amaravathi foundation, chandrababu amaravathi foundation occassion, kcr amaravathi, governor narasinhan, venkaiah naidu, ap ministers, union ministers, amaravathi invitees, sai kumar, sunitha, shivamani drums, sai kumar sunitha welcome amaravati invitees, photo gallary, governers, ministers, nirmala sitaraman, gannavaram airport, VIPs, ap capital, amaravathi

telangana chief minister kcr arrives at amaravati in a special chopper from suryapet

ప్రత్యేక హెలికాప్టర్ లో అమరావతికి చేరకున్న కేసీఆర్

Posted: 10/22/2015 11:27 AM IST
Kcr arrives at amaravathi in special chopper

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అమరావతికి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో పాటు మంత్రులు ఈటల రాజేందర్, జగదీష్రెడ్డి ఉన్నారు. అమరావతి అంకురార్పణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన నిన్న రాత్రి నల్గొండ జిల్లా సూర్యాపేటకు రోడ్డుమార్గంలో చేరుకున్నారు. రాత్రి మంత్రి జగదీశ్వర్ రెడ్డి నివాసంలోనే బస చేసిన సీఎం కేసీఆర్.. గురువారం ఉదయం 10.15 గంటలకు వారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి బయల్దేరారు.

ముందుగా కేసీఆర్ విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో కేసీఆర్‌కు ఏపీ డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప, ఎంపి మాగంటి బాబు స్వాగతం పలికారు...అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా అమరావతిలో  శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్న ఉద్దండరాయుని పాలెంకు కేసీఆర్ చేరుకున్నారు.  ఆ కార్యక్రమం పూర్తికాగానే 2.40 గంటలకు ఆయన సూర్యాపేటకు తిరుగు ప్రయాణం అవుతారు. అక్కడి నుంచి రాజధాని హైదరబాద్ కు చేరుకోనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telenagana cm  KCR  VIPs  ap capital  amaravathi  

Other Articles