Chandrababu grandsons annaprasana

Chandrababu grandsons annaprasana

Chandrababu Naidu, Nara Lokesh, Chandrababu grandson, Chandrababu Naidu grandson Devanshu, Devanshu, Nara Lokesh son

AP CM Chandraabu Naidu simply complted his grand son Devandhus annaprasana in tirumala tirupati temple. Chandrababu family members participated in this function.

తిరుమలలో చంద్రబాబు మనవడి అన్నప్రాసన

Posted: 10/19/2015 08:51 AM IST
Chandrababu grandsons annaprasana

చంద్రబాబు నాయుడు తన ముద్దుల మనువడు దేవాన్షు అన్న ప్రాసన తిరుమత శ్రీవారి సన్నిధిలో ఎలాంటి హడావిడి లేకుండా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కుటుంబ కార్యక్రమంగా నిర్వహిస్తామని.. హడావుడి ఏమీ చేయకుండా..భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా చూస్తామని చెప్పినా, అలా ఏమి జరగలేదు. స్వామి వారి దర్శనానికి వచ్చిన ప్రత్తి  ఒక్కరికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది బాబు ఫ్యామిలి. కాగా తిరుమల శ్రీవారు అంటే చంద్రబాబు నాయుడుకు ఎంతో భక్తి. అందుకే తిరుమల శ్రీవారి కటాక్షం తన మనువడి మీద కూడా ఉండాలనే ఉద్దేశంతో హడావిడి లేకుండా దేవదేవుడి సన్నిధిలో నిర్వహించినట్లు సన్నిహితులు వెల్లడించారు.

స్వయంగా ముఖ్యమంత్రే వచ్చి.. మనవడ్ని ఒళ్లో పెట్టుకొని కార్యక్రమం నిర్వహిస్తుంటే.. శ్రీవారి సేవలో తరించాల్సిన అర్చకులు కుడా ముఖ్యమంత్రి ఇంటి కార్యక్రమంలో కొంత పాలు పంచుకున్నారు.  నారా వారి వారసుడైన దేవాన్ష్ ను ఒళ్లో పెట్టుకొని బంగారు ఉంగరంతో పొంగలిని చిన్నారి నోటికి తాకించటం ద్వారా.. అన్నప్రాశన కార్యక్రమం ముగిసింది.ఇక్కడ విశేషం ఏమిటంటే..దేవాన్ష్ తల్లిదండ్రులైన నారా లోకేశ్.. బ్రాహ్మిణి ఇద్దరికి తాతగారైన దివంగత ఎన్టీఆరే ఇదే తిరుమలలో వారికి అన్నప్రాశన చేశారని.. ఇప్పుడు వారిద్దరి బిడ్డకు బాబు అన్నప్రాశన చేయటాన్ని అందరూ విశేషంగా చూశారు. నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి నిత్యాన్నదాన కార్యక్రమానికి 20లక్షల రూపాయలు విరాళం అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles