Modiji losing Bihar elections badly

Modiji losing bihar elections badly

Modi, Bihar, Elections, Nitesh Kumar, Narendra Modi, Lalu Prasad yadav, Arvind Kejriwal, Kejriwal, Bihar Elections, Second phase elections in Bihar, Bihar polls, Polling in Bihar

With the second phase of Bihar polls on, Delhi chief minister Arvind Kejriwal on Friday anticipated a victory for Nitish Kumar and claimed that the BJP, led by Narendra Modi, was all set to "badly" lose the elections.

నరేంద్ర మోదీ ఓడిపోతున్నారు

Posted: 10/16/2015 04:39 PM IST
Modiji losing bihar elections badly

నరేంద్ర మోదీకి ఎదురుదెబ్బ తగలనుంది.. మోదీకి ఊహించని విధంగా ఓటమి అనుభవం మిగులుతుంది అని ఓ ముఖ్యమంత్రి అంటున్నారు. మోదీకి గతంలో ఝలక్ ఇచ్చిన ఆ ముఖ్యమంత్రే ఈ వ్యాఖ్యలు చెయ్యడంతో సర్వత్రా ఉత్కంఠతకు తెర లేచింది. ఇంతకీ మోదీని సవాల్ చేస్తున్న ఆ ముఖ్యమంత్రి ఎవకరో తెలుసా..? దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. గత దిల్లీ ఎన్నికల్లో అపూర్వ గెలుపుతో దిల్లీ పీఠాన్ని దక్కించుకున్న కేజ్రీవాల్ తాజాగా మరోసారి మోదీకి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బీహార్ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా... నితీష్ కుమార్ తో చేతులు కలిపి అక్కడ ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే మొదటి దశ ఎన్నికలు పూర్తి చేసుకున్న బీహార్ లో నేడు రెండో విడత ఎన్నికలు జరుగుతున్నాయి.

బీహార్ ఎన్నికల్లో బిజెపి పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, జెడియు, ఆప్ లతో పలు పార్టీలు ప్రచారం్ చేస్తున్నాయి. అందులో భాగంగానే సోనియా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, రాహుల్ గాంధీ, నితీష్ కుమార్ లు ఉమ్మడిగా బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు. మొత్తం ఐదు దశల్లో జరగనున్న పోలింగ్ లో రెండు దశలు నేటితో ముగుస్తాయి. కాగా ఈ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో బిజెపి పార్టీ ఓడిపోతుందని.. నితీష్ కుమార్ మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంటున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  జోష్యం  చెబుతున్నారు. ఇంకా బీహార్ ఎన్నికల పోలింగ్ ముగియనేలేదు అప్పుడే కేజ్రీవాల్ మోదీ ఓడిపోతారని.. నితీష్ కుమార్ గెలుస్తారని చెప్పడం ఏంటా అని చర్చించుకుంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles