Finally The Eternal bride Hema Caught Who Dump Her Husbands And Some People To Gain Money | Women Crime News

Eternal bride hema caught who dump her husbands and some people

Eternal Bride news, Eternal bride hema caught, Eternal bride crimes, hyderabad Eternal bride caught, women cheating cases, women cheated husbands, women cheated people, women cheating on husbands

Eternal bride Hema Caught Who Dump Her Husbands And Some People : Finally The Eternal bride Hema Caught Who Dump Her Husbands And Some People To Gain Money.

అడ్డంగా దొరికిపోయిన ‘నిత్య’ పెళ్లి కూతురు

Posted: 10/14/2015 10:11 AM IST
Eternal bride hema caught who dump her husbands and some people

డబ్బులకోసం మోసాలకు పాల్పడడంలో పురుషులకు తామూ ఏమాత్రం తీసిపోమని మహిళలు సైతం అడ్డదారులు తొక్కేస్తున్నారు. కిడ్నాప్ లకు పాల్పడటం, ప్రేమ పేరుతో వల వేయడం, ఇంకా పెళ్లి చేసుకుని ఆపై ఆస్తి కాజేయడం కోసం రకరకాల సన్నాగాలు పన్నడం.. ఇలా ఎన్నోవిధాలుగా మహిళలు మోసాలు చేస్తుంటారు. అయితే.. వీటన్నింటికి భిన్నంగా ఓ మహిళ ‘నిత్య’ పెళ్లికూతురి అవతారం ఎత్తింది. కాస్త డబ్బులున్న వ్యక్తి కనిపిస్తే చాలు... పేరు మార్చుకుని అతని ముందు వాలిపోయి, పెళ్లి పీటలు ఎక్కించి ఆపై మోసం చేయడం ఆమె నైజం. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురిని పెళ్లాడింది. అంతేకాదు.. తాను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ నని చెప్పి, ఉద్యోగాల పేరిట పలువురిని మోసం చేసింది. చివరికి ఆస్తి కోసం బంధువులు చంపేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..  శ్రీకాకుళం జిల్లాకు చెందిన తాండ్ర హేమ అలియాస్ శైలు, రాణి, బుజ్జి, లేఖ్యారెడ్డి, హేమలత... ఇలా ఎన్నో పేర్లు మార్చింది. చాలా ఏళ్ల క్రితం నగరానికి వచ్చిన ఆమె.. దొడ్డిదారిలో డబ్బులు సంపాదించుకోవాలని నిర్ణయించింది. అంతే! అందుకు తనదైన రీతిలో ప్లాన్ వేసుకుంది. మొదట ఆమె ఎల్బీ నగర్‌ కు చెందిన రవీంద్రను పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భర్త వేధిసున్నాడంటూ ఎల్బీ నగర్ స్టేషన్‌ లో కేసు పెట్టింది. ఆపై బోరబండకు వచ్చి జగదీష్ అనే వ్యక్తిని, తరువాత పూర్ణచందర్ ను, నాలుగో పెళ్లిలో కరీంనగర్‌ కు చెందిన కిశోర్‌ ను వివాహం చేసుకుంది. వీరందరిపైనా వేధింపుల కేసులు పెట్టి వదిలించుకుంది. అలా వారినుంచి విడిపోయిన అనంతరం ఈమెకు ఆయా భర్తలనుంచి డబ్బులు కూడా బాగానే అందాయి. దాంతో ఈమెకు డబ్బు పిచ్చి మరింత ముదిరిపోయింది. అంతటితో ఆగకుండా మరింత డబ్బును సంపాదించేందుకు మరో పన్నాగం పన్నింది.

తాను రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్నట్టు ఆమె పరిచయం చేసుకుంటూ, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసింది. ఆ తర్వాత వారికి కనిపించకుండాపోయింది. దీంతో తాము మోసపోయామని డబ్బులు ఇచ్చిన వారు వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు చేయించారు. ఆమెను గాలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు కానీ.. దొరకలేదు. ఇంతలోనే ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్ గుమ్మం తొక్కింది. ఆస్తికోసం బంధువులు చంపేందుకు ప్రయత్నిస్తున్నారని.. తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఫిర్యాదు చేసింది. అంతే! ఆమె గురించి విచారించిన అనంతరం మొత్తం బండారం బయటపడింది. ప్రస్తుతం ఆమెపై ఏడు కేసులు ఉన్నాయని, ఇప్పుడు పీడీ యాక్ట్ కింద కేసు పెట్టామని పోలీసులు తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eternal Bride  Women Cheating  Hyderabad Crime News  

Other Articles