KCR on Double bed room houses

Cm kcr about the double bed room houses

KCR, Telangana, Double Bed Rooms, Houses for the poor people, Telangana CM KCR, KCR on Double Bed Rooms, Houses

Telangana cm said that double bed rooms for the poor people wil be alloted by Mla, Local Minister.CM KCR focused on Double bed room houses for the poor people. He said that govt will complete 60 thousand houses in this year.

కేసీఆర్ మాట: ఎమ్మెల్యే, మంత్రి సగం సగం

Posted: 10/14/2015 08:43 AM IST
Cm kcr about the double bed room houses

తెలంగాణ సిఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం మీద కీలక సదస్సు నిర్వహించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఎప్పుడు చేపట్టాలి.. నియోజక వర్గానికి ఎన్ని ఇళ్లు కేటాయించాలి.. గ్రామాల్లో ఎన్ని.. పట్టణాల్లో ఎన్ని.. ఎవరు దీన్ని సూపర్ వైజ్ చేస్తారు ఇలా అనేక విషయాల మీద కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్లు మొత్తం డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకానికి సూపర్ వైజ్ చేస్తారని.. వాటిని సూపర్ చెక్ చెయ్యాలని కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వచ్చినట్లు అవినీతి ఆరోపణలకు ఎలాంటి తావు లేకుండా చూడాలని అన్నారు. ఒకవేళ అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే ఎంతటి వారినైనా వదిలేదని కూడా కేసీఆర్ హెచ్చరించారు. గతంలో నిర్మించిన ఇళ్లు ప్రస్తుత అవసరాలకు అస్సలు సరిపోవడం లేదని.. వాటి కన్నా చాలా బెటర్ గా కొత్త డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామని అన్నారు. ఈ ఏడాది 60 వేల ఇళ్లను నిర్మిస్తామని కేసీఆర్ వెల్లడించారు.

తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో భాగంగా అసలు ఇళ్ల కేటాయింపు ఎలా జరుగుతుంది అన్నదే కీలకం. అయితే కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లలో సగం ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే, మిగతా సగం ఇళ్లను స్థానిక మంత్రి కేటాయిస్తారని వెల్లడించారు. ప్రతి నియోజక వర్గానికి 400 ఇళ్లను కేటాయిస్తున్నట్లు కూడా కేసీఆర్ వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో 36 వేల ఇళ్లు, పట్టణాల్లో 24 వేల ఇళ్లను కేటాయిస్తూ మొత్తంగా ఈ ఏడాది 60 వేల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని కేసీఆర్ తెలిపారు. అయితే కేసీఆర్ ప్రకటన మీద అప్పుడే ప్రతిపక్ష నాయకులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇలా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఇళ్లను కేటాయించే అధికారం ఇష్తే వాళ్లకు పనికి వచ్చే వాళ్లకు, పార్టీ కార్యకర్తలకు ఇళ్లను కేటాయించరా అని వారు అనుకుంటున్నారు. అది కూడా నిజమే మరి దీని మీద కేసీఆర్ ఎందుకు దృష్టిపెట్టలేదో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles