Junior Student Went To College Along With Knife To Warns Seniors Who Torturing Him Everyday In The Name Of Ragging | Anantapur Crime News

Junior student went to college along with knife to warns seniors who torturing him

ragging cases, junior student warns seniors with knife, college ragging cases, junior attack with knife on seniors, ragging knife incident, anantapur ragging case

Junior Student Went To College Along With Knife To Warns Seniors Who Torturing Him : Junior Student Went To College Along With Knife To Warns Seniors Who Torturing Him Everyday In The Name Of Ragging.

‘ర్యాగింగ్’ని అరికట్టేందుకు సీనియర్లపై జూనియర్ ‘కత్తి’ దాడి

Posted: 10/09/2015 10:55 AM IST
Junior student went to college along with knife to warns seniors who torturing him

కళాశాలల్లో ర్యాగింగ్ భూతం ఇంకా పెగురుతూనే వుంది. ర్యాగింగ్ కారణంగా ఎందరో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ.. సీనియర్ విద్యార్థులు తమ తీరును మార్చుకోవడం లేదు. కేవలం తమ పైశాచికానందం కోసం జూనియర్ స్టూడెంట్స్ ని నానా ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా తమ పనులు చేయించుకుంటుంటారు. ఇలాగే ఓ విద్యార్థి పట్ల సీనియర్లు ప్రవర్తించగా.. తీవ్ర అసహనానికి అతగాడు వారికి బుద్ధి చెప్పాల్సిందేనని నిర్ణయించుకుని, మరుసటి రోజు కత్తి తీసుకుని వెళ్లాడు. దీంతో ఆ కళాశాలలో ఆందోళన వాతావరణం నెలకొంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లాలోని కదిరి పట్టణంలో ఓ జూనియర్ కళాశాలలో ఇటీవల ఓ విద్యార్థి జాయిన్ అయ్యాడు. శ్రద్ధగా చదువుకని తన భవిష్యత్ ఆశయాలను నెరవేర్చుకుందామని ఎన్నో ఆశయాలతో కాలేజీలో అడుగుపెట్టిన ఆ విద్యార్థికి ఆదిలోనే సీనియర్ల నుంచి ఇబ్బందులు తప్పలేదు. ర్యాగింగ్ పేరిట సీనియర్లు ఆ విద్యార్థిని నానా ఇబ్బందులకు గురి చేశారు. అసభ్య పదుజాలంతో అతడిని తిట్టడమే కాకుండా తమ పనులు కూడా చేయించుకున్నారు. కొన్నాళ్లు వారి పైశాచికాన్ని భరించిన సదరు విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అంతే! ఆ తర్వాత వీరావేశంతో రగిలిపోయాడు. తనను నిత్యం వేధింపులకు గురి చేసిన సీనియర్లకు తగిన బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన ఆ విద్యార్థి కత్తి చేతపట్టి మరుసటి రోజు కళాశాలకు వెళ్లాడు. మునుపటిలాగే సీనియర్లు అతనిపై ర్యాగింగ్ కు పాల్పడ్డారు. దాంతో రగిలిపోయిన ఆ జూనియర్.. తనతో తెచ్చుకున్న కత్తి బయటకు తీసి వారిని బెదిరించాడు. కాస్త ఆలస్యమైతే.. ఆ విద్యార్థి సీనియర్లపై దాడి చేసేవాడే. అయితే.. ఈ విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం వెంటనే ఆ విద్యార్థిని నిలువరించింది. మరోవైపు.. ర్యాగింగ్ కు పాల్పడ్డ 10 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో భాగంగా కళాశాల పేరునుగానీ, విద్యార్థి వివరాలుగానీ బహిర్గతం కాలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ragging cases  junior attack with knife on seniors  anantapur colleges  

Other Articles