Saudi wife may be imprisoned for recording and uploading video of her husband who was forcing himself on her maid

Saudi wife faces jail after video of husband flirting with maid goes viral

Saudi,husband,caught,groping,forcing,maid,suspicious,wife,set,hidden,camera,faces,going,jail, Saudi husband Is Caught GROPING And FORCING, Saudi Arabia, Wife's video of husband flirting with maid goes viral, Video Clip, forced kiss, forcing himself on her maid, Saudi wife, suadi arabia, hushand's effair video, youtube, punishment to wife

Saudi husband is caught groping and forcing himself on his maid after his suspicious wife set up a hidden camera… but now SHE faces going to jail

ITEMVIDEOS: పనిమనిషిపై భర్త లైంగిక వేధింపులు.. భార్యకు శిక్ష..

Posted: 10/08/2015 05:02 PM IST
Saudi wife faces jail after video of husband flirting with maid goes viral

తన భర్త గుట్టును రహస్య కెమెరాలతో రట్టు చేసి.. అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్ లో పెట్టినందుకు గాను సదరు మహిళకు జైలు శిక్షను అనుభవించనుంది. పనిమనుషులు పిర్యాదుతో తేరుకుందో లేక.. తనకే అనుమానం కలిగిందో కానీ తాను లేనప్పుడు తన భర్త  పని మనిషిలపై లైంగికంగా వేధిస్తున్నాడని తెలుసుకున్న ఓ సౌదీ మహిళ రహస్య కెమెరాతో తన భర్త తతంగాన్ని మొత్తం రికార్డుచేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాపై ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతున్న సౌదీ ప్రభుత్వం ఈ వీడియో అంశం తెలిసి మరింత చిర్రెత్తుకొచ్చింది. వెంటనే దాన్ని తొలగించాల్సిందిగా స్థానిక అధికారులను ఆదేశించింది.

ఇంతవరకు సరే అనుకున్నా.. అంతటితో అగలేదు.. తన భర్త పరువు బజారుపాలు చేసినందుకు ఏడాది పాటు జైలు శిక్ష లేదా దాదాపు 87 లక్షల రూపాయల జరిమానాను భార్యకు విధించనుందని ఓ ప్రముఖ సౌదీ న్యాయవాది ఇప్పటికే ఆ సౌదీ మహిళను హెచ్చరించారు. తన భర్త పనిమనుషులపై లైంగికంగా వేధిస్తూ.. వారితో సరససల్లాపాలు సాగిస్తున్నాడన్న అనుమానంతోనే తాను ఇలాంటి చర్యలకు పాల్పడ్డానని భార్య చెబుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. అయితే అమెకు తన భర్త ప్రవర్తనపై ఎప్పటి నుంచో అనుమానం ఉంది. తాను లేనప్పుడు పని మనిషులతో సరస సల్లాపాలు సాగిస్తాడని అనుకుంది.

ఈ క్రమంలో ఓ రోజు కిచెన్‌కు సమీపంలో రహస్యంగా ఓ వీడియో కెమెరాను ఏర్పాటు చేసింది. కిచెన్ లోపల ఓ పనిమనిషి సంచరిస్తుండగా, కిచెన్ డోర్ పక్కన మరో పనిమనిషిని భర్త దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడం, ఆ అమ్మాయి తప్పించుకోవడానికి ప్రయత్నించడం ఆ వీడియోలో రికార్డు అయింది. ‘ఈ నేరానికి కనీస శిక్ష విధించాలి’ అన్న శీర్షికతో ఆ వీడియో క్లిప్పింగ్‌ను యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది భార్య. 12 గంటల్లోపే 25 వేల మంది దీన్ని షేరు చేసుకున్నారు.  మొబైల్ లేదా ఇతర కెమెరాల ద్వారా ఎవరి వ్యక్తిగత అంశాలనైనా రికార్డుచేసి పదిమందిలో వారి పరువు తీయడం స్థానిక సమాచార సాంకేతిక చట్టాల ప్రకారం పెద్ద నేరమని న్యాయవాది మజీద్ ఖరూబ్ స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : forced kiss  forcing himself on her maid  Saudi wife  imprisonment  viral video  

Other Articles