Modi give suggestion to laluprasad

Narendramodi give suggestion to laluprasad yadav

Modi, lalu Pradsad, narendra Modi, Bihar Elections, Bihar, Modi in BIhar, Lalu Prasad slams Modi

Prime Minister Narendra Modi on Thursday attacked RJD chief Lalu Prasad over his "Hindus also eat beef remark", saying the former Bihar CM has insulted the Yadav community. Lalu Prasad and 'jungle raj' were the two main themes of PM Modi's election speeches at Munger and Begusarai. He dubbed the grand secular alliance against the BJP a "mahaswarth bandhan"

లాలూకు మోదీ ఉచిత సలహా

Posted: 10/08/2015 04:02 PM IST
Narendramodi give suggestion to laluprasad yadav

లాలూ ప్రసాద్ యాదవ్ కు మోదీకి అస్సలు పొసగదు. మోదీ మాటెత్తితేనే లాలూ ప్రసాద్ యాదవ్ కు ఎక్కడ లేని చిరాకు వస్తుంది. మరి అలాంటి లాలూ ప్రసాద్ కు ప్రధాని నరేంద్రమోదీ ఓ ఉచిత సలహా ఇచ్చారు. లాలూజీ ఎలక్షన్ లు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ మన అనుకున్న వాళ్లు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉంటారు మరి అలాంటప్పుడు మన వాళ్లను అవమానించేలా మాట్లాడటం సరైందేనా అంటూ మోదీ లాలూకు సలహా ఇచ్చారు. లాలూ ప్రసాద్ రీసెంట్ గానే మోదీ డబ్ స్మాష్ చేసి యుట్యుబ్ లో అప్ లోడ్ చేశారు. దానికి విపరీతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది.

హిందువులు కూడా  గొడ్డుమాంసం తింటారంటూ  ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్  చేసిన ప్రకటనను  ప్రధాని  నరేంద్రమోదీ తెగనాడారు.  లాలూప్రసాద్ యాదవ కమ్యునిటీని అవమానపరుస్తున్నారని  ప్రధాని వ్యాఖ్యానించారు.  బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో  భాగంగా ఆటవిక రాజ్యం కావాలో? అభివృద్ధి రాజ్యం కావాలో? తేల్చుకోవాలని ప్రధాని బిహార్‌ ఓటర్లకు పిలుపు ఇచ్చారు. ఎన్డీయే సాధించిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గురువారం బిహార్‌లోని ముంగేరులో జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. లాలూ, నితీష్‌ కుమార్‌లపై వాక్భాణాలు సంధించారు. యాదవ్‌ల ఓట్లు వేయించుకున్న లాలూ తన కులాన్ని అవమానపరిచారని మోదీ విమర్శించారు.   ప్రధాని మోదీ తన ఏ ప్రసంగంలోనూ దాద్రీ వ్యవహారాన్ని ప్రస్తావనకు తీసుకురాలేదు. ఆ అంశంపై పూర్తిగా మౌనం వహించారు.

బిహార్లకు లక్షా 65 వేల కోట్ల ఫ్యాకేజీ ఇవ్వడం ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు ఇష్టంలేదని మోదీ ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్‌ పూర్తిగా దెబ్బతిన్నదని, దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు లాలూ, నితీష్‌ పంచన చేరిందని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ జనం మౌనంగా ఉన్నట్లు కనిపిస్తారని... సమయం వచ్చినప్పుడు మొత్తం లెక్క చెబుతారని అన్నారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ అహంకారం ఎలా దెబ్బ తిన్నదో గుర్తుంది కదా అని ఆయన అన్నారు. బిహార్‌ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ అహంకారం ఓడిపోతుందని, బిహార్‌ ప్రజలు ఈ పని చేసి చూపిస్తారని మోదీ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  lalu Pradsad  narendra Modi  Bihar Elections  Bihar  Modi in BIhar  Lalu Prasad slams Modi  

Other Articles