Ramdev baba is dagerous

Ramdev baba is dagerous

Ramdev Baba, Lalu Prasad, Bihar, Beef ban, Bihar Elections, RamDevBaba about beef ban, Beef

In the raging politics over beef after a mob killing in Uttar Pradesh last week, Bihar politician Lalu Prasad Yadav has responded to yoga teacher Ramdev's dig by resurrecting an old allegation against him. Ramdev himself faced allegations that he used animal bones in his medicines," Mr Prasad snapped when asked to respond to the yoga teacher calling him a descendant of "Kans", the fictional villain who was killed by Hindu god Krishna.

బాబా రాందేవ్ చాలా డేంజర్

Posted: 10/07/2015 03:40 PM IST
Ramdev baba is dagerous

బాబా రాందేవ్ నిన్నటి దాకా యోగాతో దేశానికి తెలుసు. అయితే తాజాగా బీహార్ ఎన్నికల్లో బాబా రాందేవ్ హాట్ టాపిక్ గా మారారు. మామూలు నేతలు రాందేవ్ గురించి మాట్లాడితే పెద్దగా ప్రయోజనం ఉండేది కాదేమో కానీ లాలూ ప్రసాద్ లాంటి వ్యక్తి బాబా రాందేవ్ గురించి పదే పదే ప్రస్తావించడం వార్తల్లో నిలుస్తోంది. యోగాతో పాటు అప్పుడప్పుడు బీజెపీ పార్టీకి మద్దతుగా మాట్లాడుతూ ఎన్నికల్లో కూడా హల్ చల్ చేస్తుంటారు బాబా రాందేవ్. తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ బాబా రాందేవ్ ను టార్గెట్ గా చెయ్యడం మీద సర్వత్రా చర్చ సాగుతోంది. బాబా రాందేవ్ చాలా డేంజర్ అని లాలూ ప్రసాద్ అంటున్నారు.

బీహార్ ఎన్నికల్లో బాగంగా జరుగుతున్న ఎన్నికల ర్యాలీ లో పాల్గొన్న లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ. ఆర్ఎస్ఎస్ కంటే కూడా బాబా రాందేవ్ చాలా డేంజర్ అని వ్యాఖ్యానించారు. రాందేవ్ ఆర్ఎస్ఎస్ ను మించిన కరుడుగట్టిన హిందుత్వవాది అని వ్యాఖ్యానించారు. ఆయన తయారుచేసే ఔషధాల్లో పశువుల ఎముకలు కలుపుతున్నారని సీపీఎం నేత బృందా కారత్ అన్న విషయాన్ని లాలూ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాంటప్పుడు పశువుల ఎముకలైనా, మనిషి ఎముకలైనా తేడా ఏముందని అడిగారు. బీహార్ లో ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ, నల్లధనం విషయంలో రాందేవ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. బాబా సాధువు కాదని, సొంత పనులు చక్కబెట్టుకునే వ్యక్తని విమర్శించారు. రాందేవ్ అమ్ముతున్న మందుల వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరగాలని లాలూ డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramdev Baba  Lalu Prasad  Bihar  Beef ban  Bihar Elections  RamDevBaba about beef ban  Beef  

Other Articles