Hardik Patel showered with money in public meet

Money shower on hardik

Hardik patel, video, Currency rain, Money Rain, Gujarat, Patel protest

A video clip purportedly showing Patel quota stir leader Hardik Patel being showered with currency notes at a public gathering in Surat district went viral on social media on Sunday. The clip, which has been put up on social media portals, including Youtube, showed people showering currency notes on Hardik while he was speaking at a folk music function, 'Dayro', in Gosamada village of Surat in the wee hours of Sunday.

ITEMVIDEOS: నోట్ల వర్షం... నోట్ల వర్షం

Posted: 10/05/2015 09:52 AM IST
Money shower on hardik

కడుపు కోసం కోటి విద్యలు అని అందరికి తెలుసు. అందుకే కడుపు నింపుకోవడానికి రకరకాల జాబులు. రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. అయితే నోట్ల కట్టలు వర్షంలా కురిస్తే ఎలా ఉంటుంది.. వంద, ఐదు వందలు, వెయ్యి నోట్లు వర్షంలా కురిస్తే ఎలా ఉంటుంది. అవును డబ్బులు ఎక్కువైతే అలానే ఉంటుంది. గుజరాత్ లో పటిదార్ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. సామాజిక ఉన్నత వర్గాలు ఆర్థికంగా వెనుకబడటం హార్దిక్ పాటిల్ ఉద్యమానికి ఊపుతీసుకువచ్చింది. అయితే తాజాగా హార్దిక్ పాటిల్ పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఏకంగా నోట్ల వర్షం కురిపించిన పటేల్ అభిమానులు. తమ నోటు అభిమానాన్ని చాటుకున్నారు.

హార్దిక్ పాటిల్ గత కొంత కాలంగా పటేల్ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా గుజరాత్ తో సహా చాలా ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. అయితే కేవలం 22 ఏళ్ల హార్దిక్ పాటిల్  ఉద్యమం మొత్తం నోట్ల మీదే నడుస్తోంది అన్న వార్తలకు మరింత బలం చేకూరేలా తాజాగా ఓ వీడియో బయటకు వచ్చింది. ఓ కార్యక్రమంలొ పాల్గొనడానికి వచ్చిన హార్దిక్ పాటిల్ మీద వంద, ఐదు వందలు, వెయ్య రూపాయల నోట్లను కుమ్మరించడం.. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ వీడియో మీద పటేల్ వర్గానికి చెందిన వారు కూడా వెనకేసుకొస్తున్నారు. పెద్ద పెద్ద ఫంక్షన్ లలో ఇలా జరగడం మామూలే అని వారంటున్నారు. అయితే డబ్బులు ఎక్కువైతే పేదలకు పంచడమో లేదంటే వేరే ఏదో చెయ్యడమే చెయ్యాలి కానీ ఇలా చేస్తారా అంటే ఆశ్చర్యపోయే వాళ్లు ఆశ్చర్యపొతూనే ఉన్నారు. ఆకలి అరుపులకు. అరగని తేన్పులకు తేడా లేదంటే ఎలా మరి...!

*Abhinavachary*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hardik patel  video  Currency rain  Money Rain  Gujarat  Patel protest  

Other Articles