Lorries Stopped Whole India Wide And Petrol Bunks Bandh In Andhra Pradesh | Ap Controversies

Lorries stopped and petrol bunks bandh in andhra pradesh

lorries stopped indiawide, petrol bunks in andhra pradesh, petrol bunks controversy, andhra pradesh controversies, andhra capital city

Lorries Stopped And Petrol Bunks Bandh In Andhra Pradesh : Lorries Stopped Whole India Wide And Petrol Bunks Bandh In Andhra Pradesh

నిలిచిన లారీలు.. మూతపడ్డ పెట్రోల్ బంకులు..

Posted: 10/01/2015 10:28 AM IST
Lorries stopped and petrol bunks bandh in andhra pradesh

టోల్ ప్లాజా, స్పీడ్ గవర్నర్ల ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ లారా యాజమాన్యాలు అర్థరాత్రి నుంచే సమ్మె చేపట్టారు. దీంతో దేశవ్యాప్తంగా వుండే లారీలన్ని ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 14 లక్షల మేర లారీలు నిలిచిపోయాయని సమాచారం. ఆలిండియా మోటారు ట్రాన్స్‌పోర్టు కాంగ్రెస్ పిలుపు మేరకు అక్టోబర్ ఒకటి నుంచి దేశవ్యాప్తంగా నిరవధిక రవాణా బంద్ చేపడుతున్నారు. అయితే.. ఈ లారీల సమ్మె ప్రభావం దేశ ఎగుమతులు, దిగుమతులపై తీవ్రంగా పడే అవకాశాలున్నాయి. అంతేకాదు.. విశాఖ పోర్టులో సరుకు రవాణాపైనా తీవ్ర ప్రభావం పడే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు భఆవిస్తున్నారు.

మరోవైపు.. వ్యాట్ తగ్గించాలన్న డిమాండ్ తో ఏపీలో పెట్రోల్ బంకుల యాజమాన్యాలు చేపట్టిన ఆందోళన కూడా అర్థరాత్రి నుంచే ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అయితే వాహనదారులకు కొంత ఉపశమనం కలిగించే డిమాండ్ తో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లీటరుకు రూ.4 చొప్పున అదనంగా పెంచి.. వ్యాట్‌ను రద్దు చేయాలని కోరుతూ పెట్రోల్ బంకుల నిరవధిక బంద్‌ను పాటించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.గోపాలకృష్ణ  గుంటూరులో ప్రకటించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lorries stopped indiawide  petrol bunks in andhra pradesh  

Other Articles