hyderabadis experience hot summer temperature in september

Hyderabad breaks 88 years september temperature record

hyderabadis experience hot summer temperature, high temperature in september, mercury touches 36.5 in hyderabad, hyderabad, hot summer temperature, september, mercury touches 36.5

hyderabadis experience hot summer temperature in september as the mercury touches 36.5 on thursday, breaking 88 years record

రికార్డును తిరగరాసిన హైదరాబాద్.. భానుడి భగభగ

Posted: 09/25/2015 05:08 PM IST
Hyderabad breaks 88 years september temperature record

హైదరాబాద్ ఎనభై ఎనమిదేళ్ల రికార్డును తిరగరాసింది. భానుడి భగ భగతో సెప్టెంబర్ మాసంలో హైదరాబాదీలు గ్రీష్మతాపాన్ని చవిచూస్తున్నారు. నగర వాతావరణంలో గత 88 ఏళ్ల తరువాత ఇంతటి పెనుమార్పు సంభవించింది. మునుపెన్నడూ లేనంతగా సెప్టెంబర్ మాసంలో 36.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత గురువారం మధ్యాహ్నం నమోదైంది. అంతేకాదు శుక్రవారం కూడా భానుడు భగభగ మండుతున్నాడు. 88 ఏళ్ల తరువాత రికార్డు స్థాయిలో అప్పటి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతల కన్నా అధికంగా గ్రీష్మతాపం నమోదు కావడం ఇదే ప్రథమం. ఈ మాసంలో 1927లో 36.1 డిగ్రీలే ఇప్పటి వరకు అత్యధికం.

కానీ... తాజా ఎండలు ఈ రికార్డును బద్దలు కొట్టి వేసవిని తలపించాయి. అయితే సాయంత్రమయ్యేసరికి ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పొడి వాతావరణ పరిస్థితుల వల్ల భూ వాతావరణంలో వేడి క్రమంగా పెరగడం... ఈ వేడి గాలి పైకి వెళ్లి మేఘాలుగా ఏర్పడడటంతో ఇలా జల్లులు కురిశాయని బేగంపేట్ వాతావరణ శాఖ డెరైక్టర్ వైకే రెడ్డి తెలిపారు. ఇది అసాధారణమేమీ కాదన్నారు. ప్రస్తుతం గాలిలో తేమ 60 శాతం మేర ఉండటం వల్ల ఉక్కపోత అధికంగా ఉందన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad  hot summer temperature  september  mercury touches 36.5  

Other Articles