KCR Announce Dasara gift

Telangana cm kcr announce dasara gift

KCR, Telangana, Singareni, Profit, singareni collieries, singareni collieries employees

Telangana cm KCR Announce Dasara gift. KCR Announce share in 20 percent profit to singareni collieries employees. before KCR announcement, the govt giving 18percent share in profit.

కేసీఆర్ దసరా కానుక వాళ్లకు మాత్రమే

Posted: 09/25/2015 07:55 AM IST
Telangana cm kcr announce dasara gift

సింగరేణి కాలరీస్‌ ఈ ఏడాది సాధించిన లాభాల్లో 21 శాతం వాటా చెల్లించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కార్మికుల నుంచి  ప్రొఫెషనల్‌ టాక్స్‌ కూడా వసూలు చేయవద్దని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత, సింగరేణి సిఎండి శ్రీధర్‌, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు తదితరులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ తాజా ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సింగరేణి లాభాల్లో కార్మికులకు 18 శాతం వాటా చెల్లించేవారు. రాష్ట్రం ఏర్పడ్డ మొదటి ఏడాది లాభాల్లో 20 శాతం వాటా ఇచ్చారు. ఈ ఏడాది సింగరేణి 491 కోట్ల లాభం పొందింది. ఇందులో 21 శాతం వాటా 103.11 కోట్లు కార్మికులకు అందుతుంది.

సింగరేణిలో పనిచేసే 60 వేల మంది కార్మికులకు వ్యక్తిగతంగా 15 వేల నుంచి 20 వేల వరకు లాభం అందుతుంది. సింగరేణి కార్మికులు ఎంతో కాలంగా కోరుతున్న ప్రొఫెషనల్‌ టాక్స్‌ మినహాయింపుపై కూడా సిఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్మికుల నుంచి ప్రొఫెషనల్‌ టాక్స్‌ వసూలు చేయరాదని విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని, ఇకపై వృత్తిపన్ను వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు. 1990 నుంచి ప్రొఫెషనల్‌ టాక్స్‌ ద్వారా ప్రభుత్వానికి బకాయి ఉన్న 175 కోట్లను కూడా మాఫీ చేయాలని సిఎం నిర్ణయించారు. గత బకాయిలు మాఫీ చేయడంతో పాటు ప్రతి ఏడాది వసూలు చేయాల్సిన 15 కోట్ల మేర వృత్తి పన్ను కూడా ఇకపై వసూలు చేయరు.

*Abhinavachary*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Telangana  Singareni  Profit  singareni collieries  singareni collieries employees  

Other Articles