A Viral Text Printed In Class Book That Unemployement Percent Increased Because Of Working Women Controversy

Unemployement percent increased because of working women

unemployement, working women, tenth class text books, text books controversies, virat text in books, working women controversy

Unemployement Percent Increased Because Of Working Women : A Viral Text Printed In Class Book Which Creates Controversy. The Text Is.. Unemployement Percent Increased Because Of Working Women.

మగాళ్లు నిరుద్యోగులవ్వడానికి మహిళలే కారణమట!

Posted: 09/23/2015 01:26 PM IST
Unemployement percent increased because of working women

ఏ విధంగా అయితే ప్రస్తుత ఆధునిక యుగం వేగంగా పరుగులు తీస్తుందో.. అదేవిధంగా నిరోద్యగ సమస్య పెరుగుతోంది. దీంతో ఎంతోమంది యువకులు తమ చేత ఉద్యోగ పత్రాలు పట్టుకుని కాలక్షేపం చేయాల్సి వస్తోందే తప్ప.. ఉద్యోగాలు లభించడం లేదు. అయితే.. ఈ నిరుద్యోగ శాతం పెరగడానికి మహిళలే కారణమని సమాచారం. పురుషులకు సమానంగా మహిళలు అన్నిరంగాల్లోనూ పనిచేయడం వల్లే ఈ సమస్య పెరిగిందిట. ఈ విషయం వెల్లడిస్తోంది నిపుణులు కాదు.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో సెకండరీ స్కూలు విద్యార్థులకు బోధించే పాఠ్య పుస్తకంలోనివి. ఇది వినడానికి ఆశ్చర్యంగా వున్నా.. నమ్మక తప్పదు.

ఆ రాష్ట్రానికి చెందిన పదో తరగతి ప్రభుత్వ పాఠ్యపుస్తకంలోని ఓ పాఠంలో మహిళలే వల్ల నిరుద్యోగ శాతం పెరిగిందని ప్రచురించారు. ‘ఉద్యోగాలు చేస్తున్న మహిళల వల్ల నిరుద్యోగం పెరుగుతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగ శాతం పెరిగింది. పురుషులకు సమానంగా మహిళలు కూడా అన్నిరంగాల ఉద్యోగాల్లో పనిచేయడమే దీనికి కారణం’ అని ఆ పాఠంలో పేర్కొన్నారు. విద్యార్థులపై ప్రభావం చూపే ఈ అనుచిత పాఠ్యాంశంపై జాష్ పూర్ కు చెంది ఓ టీచర్ మహిళా కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో.. ఇది వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇదే విషయమై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఈ ఉదంతాన్ని మహిళా కమిషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లింది. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. మహిళా సంఘాలు, సామాజిక ఉద్యమకారులు కూడా విద్యార్థులకు ఇలాంటి విషయాలను బోధించడంపై మండిపడుతున్నారు.

ఇదిలావుండగా.. పాఠ్యపుస్తకాల్లో ఇలాంటి తప్పులు దొర్లడం ఇదే మొదటిసారి కాదు. గతంలో 2014లో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన సెకండరీ పాఠ్యపుస్తకాల్లో స్వాతంత్య్ర సమరయోధులను ఉగ్రవాదులుగా పేర్కొన్నారు. అలాగే 2013లో మహారాష్ట్రకు చెందిన పాఠ్యపుస్తకాల్లో అరుణాచల్ ప్రదేశ్ను దేశపటం నుంచి తొలగించేశారు. 2012లో మరో రాష్ట్రంలోని సీబీఎస్సీ సిలబస్లో మాంసాహారం తినేవారు అబద్ధాలు ఆడతారని పేర్కొన్నారు. అటువంటి వాటిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో.. ఆయా పాఠ్యపుస్తకాలను ఉపసంహరించుకున్నారు. అయినప్పటికీ ఇంకా తప్పులు దొర్లడాన్ని చూస్తుంటే.. అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : unemployement  working women  

Other Articles