Delhi government performed an onion scam

Aap govt at onion scam

Onion, Prices, Delhi, Onion scam, kejriwal, Arvind Kejriwal

As known, onions are now far away from the middle class people, due to its heavy costs. Regarding this, in view of reaching the common people, the central government recently introduced a good scheme, due to which the onions can be supplied in the reasonable prices.

ITEMVIDEOS: పాపం.. ఉల్లిస్కాంలో కేజ్రీ సర్కార్

Posted: 09/21/2015 03:36 PM IST
Aap govt at onion scam

అసలే ఉల్లి.. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిచేత కన్నీళ్లు పెట్టిస్తోంది. అలాంటి ఉల్లిపాయల గురించి ఎవరు మాత్రం భయపడరు చెప్పండి. కాగా అందరి కన్నా ఎక్కువగా ఓ ముఖ్యమంత్రిగారు అతిగా హడలిపోతున్నారు. ఉల్లిపేరు చెబితేనే చలి జ్వరంతో వణికిపోతున్నారు. అంతలా ఏం జరిగింది అనుకుంటున్నారు. సదరు ముఖ్యమంత్రిగారు ఉల్లిస్కాం చేశారని వస్తున్న వార్తలే.. సిఎంగారికి చెమటలు పట్టిస్తున్నాయి. అంతలా ఉల్లిపాయల భయం పట్టుకున్న కేజ్రీవాల్ మీద విపక్షాలు మరింత విమర్లకు పదునుపడెతున్నాయి. ఉల్లిపాయల స్కాంలో కేజ్రీవాల్ కు మంచి క్రేజ్ ఉందని అంటున్నారు. అయితే అసలు ఎంత స్కాం జరిగింది..? కేజ్రీవాల్ కీలకం అని ఎలా అనుకుంటున్నారు.? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

ఢిల్లీలో ఉల్లి ధర ఆకాశాన్ని అంటింది. కిలో ఉల్లి ధర వంద రూపాయల దాకా ఉండటం అందరికి ఆశ్చర్యాన్ని .... సగటు మనిషికి ఆక్రోశాన్ని తెప్పిస్తోంది. అయితే అక్కడి వారికి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఉల్లిని కేవలం 30 రూపాయలకే అందించింది. మరి బయట వంద రూపాయల ఉల్లిని కేవలం 30కే అందించడంలో మంచే ఉంది కదా అని అనుకుంటున్నారా..? అయితే ఆ ఉల్లిని ఢిల్లీ సర్కార్ కేవలం 18 రూపాయలకే కొని.. ప్రజలకు మాత్రం 30 రూపాయలకు అమ్ముతోందట. కానీ అక్కడి సర్కార్ మాత్రం కిలో నలభైకి కొన్నాం.. కానీ ప్రజల కోసం ఎంత భారమైనా కానీ 30 కే అందిస్తున్నామని డాబు కొడుతోంది. మొత్తంగా ఉల్లిస్కాం ఢిల్లీ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తోంది. మరి దీని మీద కేజ్రీవాల్ ఏదో ప్రకటన చెయ్యకపోతే.. ప్రజల్లో అప్రతిష్టపాలుకాకతప్పదు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Onion  Prices  Delhi  Onion scam  kejriwal  Arvind Kejriwal  

Other Articles