Home minister on SI Suicide

Telangana home minister naayini narasimha reddy assure to si amesh family

SI Ramesh, Sand Mafia, Naayini Narasimha Reddy, Telangana, Suicide, SI Suicide

Telangana Home minister Naayini Narasimha Reddy assure to SI amesh Family. He announce that CID Interragation will do on SI Ramesh Suicide.

ఆ ఎస్సై చావుకు కారణాలు ఏంటో...?

Posted: 09/17/2015 04:03 PM IST
Telangana home minister naayini narasimha reddy assure to si amesh family

రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేష్ మృతిపై సీఐడీ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మృతి వెనక ఇసుక మాఫియా హస్తం ఉందేమోనన్న అనుమానాలు ఉన్నాయని, ఈ కారణంగానే తాము విచారణకు ఆదేశించామని తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఎస్ఐ రమేష్ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్నట్లు నాయిని తెలిపారు. ఇది అత్మహత్యే అని పోలీసు అధికారులు అంటుండాగా.. కాదు కాదు ముమ్మటికి తన భర్త ది హత్యే అని మృతి చెందిన ఎస్సై భార్య ఆరోపిస్తుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది... భార్యతో బయటికెళ్లివచ్చిన రమేష్ రెండు గంటల్లోపే ఎందుకు అసువులు బాసాడు.

ఏం జరిగింది....
2011 బ్యాచ్ సబ్ ఇన్స్ పెక్టర్ రమేష్ ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా యాలాల్ పి.ఎస్ లో పని చేస్తున్నాడు. సాయంత్రం 5 గంటలకు అదే పిఎస్ లో పని చేసే కానిస్టేబుల్ రమేష్ తో కారులో భార్యతో సహ తాండురుకు వెళ్లాడు.... అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే పెదెమూల్ నుంచి లక్ష్మణ్ నాయక్ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఆ తర్వత కొద్దిసేపటికి తాండుర్ టౌన్ సి.ఐ వెంకట రామయ్య ఫోన్ చేశారు.. వెంటనే తన దగ్గరకు రావాలని .. గణేష్ చవితి బందోబస్త్ పై మాట్లాడేందుకు అని అన్నాడు.. కాని రమేష్ మాత్రం తన భార్యతో హస్పటల్ కి వచ్చానని ... డ్యూటిలో లేనని సమాధానం ఇచ్చాడు.. దీంతో సంతృప్తి చెందని సిఐ ఎలాగైన రావల్సిందేనాని హుకూం జరిచేశాడు.. తప్పనిసరి పరిస్తితుల్లో 7 గంటలకు భార్యను తాండుర్ అటో ఎక్కించి ఓ కానిస్టేబుల్ ను వెంటపంపాడు.. ఆ తర్వత ఎక్కడికి వెల్లాడు ఏం చేశాడు .. అనేది ఇప్పటికి మిస్టరిగా ఉంది..

7 గంటలకు అటో ఎక్కించిన భర్త 9:58 PM లకు తాను కందవెల్లి గ్రామంలో చెట్టు కింద ఉన్నాని భర్యకు SMS పెట్టాడు ...ఆ తర్వాత 9:59PM కి SORRY అంటూ మెసేజ్ పెట్టాడు.. దీంతో ఆందోళన చెందిన భార్య ఫోన్ చెయడం మొదలు పెట్టింది. కాని ఎంతకు ఆన్సర్ చేయకపోవడంతో 10:04 ని..బావా ఫ్లీజ్ కాల్ మీ అని SMS చేసింది.. అయినా సమాధానం లేకపోవడంతో అందరీకి తెలుపగా కందనవెల్లి గ్రామసమీపంలోకి వెళ్ళి చూడగా  ఆయన చెట్టుకు ఉరేసుకొని కనిపించారు.. 7గంటలకు భార్యను ఆటో ఎక్కించిన రమేష్ 9:58 ని.. వరకు ఎక్కడికి వెళ్లాడు..అనేది ఇప్పుడు తేలాల్సిన అంశం .. రూరల్ పరిధిలోకి వచ్చే యాలాల్ పి.ఎస్ లో పని చేసే రమేష్ పై అర్బన్ సి.ఐ ఎందుకు అధిపత్యం చేశాడు.. అనేది.. ఇంకో ప్రశ్న .. అసలు లక్ష్మన్ నాయక్ ఎవరు అతను ఫోన్ చేయగానే సి.ఐ ఎందుకు ఫోన్ చేశాడు.. ఆ వెంటనే భార్యను వదిలి రమేష్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది.. ఇవన్ని కుటుంబ సభ్యుల ప్రశ్నలు ... అంతే కాకుండా అర్బన్ సి.ఐ వెంకటరామయ్య .... రూరల్ సిఐ శివశంకర్ లే మృతికి కారణమని ... అంతేకాకుండా ఇసుక మాఫీయాతో కుమ్మకై తన భర్తను హత్య చేయించారని రమేష్ భార్య ఆరోపిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోపణలతో పాటు సిఐడి విచారణ కూడా చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.. మృతిదేహన్ని తాండురు లో కాకుండ ఉస్మానియా కు పోస్టుమార్టమ్ జరిపాలని డిమాండ్ చేశారు.. దీంతో పోలీస్ ఉన్నాతాధికారులు డెడ్ బాడిని ఉస్మానియాకు పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SI Ramesh  Sand Mafia  Naayini Narasimha Reddy  Telangana  Suicide  SI Suicide  

Other Articles