Woman saved by her bra after being struck by lightning during a storm

Bra saves china woman s life acting like a faraday cage

Woman,saved,bra,struck,lightning,storm,Bra, saves, china, lightning strike, wires in her bra, city of Guangzhou, southern China, woman survived a lightning strike, underwire bra acted like a Faraday Cage, vital organs

A Chinese woman has miraculously survived a lightning strike thanks to the wires in her bra. A woman from the city of Guangzhou, southern China, survived a lightning strike on Monday after her underwire bra acted like a Faraday Cage and diverted power surges away from her vital organs

మహిళ ప్రాణాలను కవచంలా కాపాడిని బ్రా..!

Posted: 09/11/2015 08:10 PM IST
Bra saves china woman s life acting like a faraday cage

చైనాలో ఓ మహిళ తాను ధరించిన లో దుస్తు బ్రా కారణంగా బతికి బయటపడింది. వినడానికి ఇది చాలా విచిత్రంగా ఉంది కానీ.. దీనిని అర్థం చేసుకోవాలంటే మాత్రం ఎంతో కొంత సైన్సు పరిజ్ఞానం మాత్రం ఉండి తీరాల్సిందే. ఆ మహిళ ధరించిన బ్రా పిడుగుపాటు వల్ల వెలువడే విద్యుత్తును దారి మళ్లించి కీలకమైన అవయవాలకు గాయాలు కాకుండా కాపాడింది. అయితే దీనిలో కీలకపాత్ర పోషించింది మాత్రం ఆమె ధరించిన బ్రాలో ఉన్న మెటల్ వైర్లే. వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని బీజింగ్ నగరం దగ్గర్లోని ఓ ప్రాంతం చాలా రోజులుగా తుఫానులో చిక్కుకుంది. ఆ ప్రాంతానికి చెందిన లాయ్ అనే మహిళ తన కుమారుడిని పాఠశాల నుంచి తీసుకురావడానికి గొడుగు వేసుకుని బయలుదేరింది.

ఓ చెక్క బ్రిడ్జి వద్దకు రాగానే పెద్ద శబ్దంతో పిడుగు పడింది. ఆమె గొడుగుకు ఉన్న మెటల్ ఫ్రేమ్ కారణంగా అది ఆమె వైపునకు దూసుకువచ్చింది. సరాసరి ఆమె చెస్ట్‌లోకి ప్రవేశించింది. అయితే ఆమె ధరించిన బ్రా ఆ పిడుగును అడ్డుకుంది. ఆ బ్రాలోని మెటల్ వైర్లు ఫారడే కేజ్‌లా పనిచేసి ఆ మెరుపులోని తీవ్రత తగ్గించి విచ్ఛిన్నం చేశాయి. ముఖ్యమైన అంగాలకు ప్రమాదం వాటిల్లకుండా అడ్డుకున్నాయి. అయితే ఆ ధాటికి ఆమె ధరించిన దుస్తులు మాత్రం పూర్తిగా కాలిపోయాయి. చర్మం కూడా కాలిపోయింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిందని వైద్యులు ధ్రువీకరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bra  saves  china  Woman  struck  lightning  Faraday Cage  storm  

Other Articles