Telangana cm KCR speech in World Economic Forum at china

Kcr speech at wef meeting in china

KCR, China, World Economic Forum, Modi, Team India, Neeti Ayog

Telangana cm KCR speech in World Economic Forum at china. KCR said that neeti ayog will work as team india.

వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కేసీఆర్ ఏమన్నారంటే..

Posted: 09/09/2015 04:24 PM IST
Kcr speech at wef meeting in china

చైనాలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో భాగంగా నేడు జరుగుతున్న సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఎమర్జింగ్ మార్కెట్ ఎట్ క్రాస్ రోడ్స్ అంశంపై సీఎం కేసీఆర్ ప్రసంగించారు. దేశాభివృద్ధిపై కేసీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దంన్నరపాటు పోరాడాం. మాది వేర్పాటువాద ఉద్యమం కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోగం విఫలమైంది. 15 నెలల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రజలు పూర్తి సంతోషంగా ఉన్నారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక విధానం తీసుకువచ్చాం. రెండు వారాల్లో అనుమతులు పొందే హక్కు పారిశ్రామికవేత్తలకు ఉండేలా ప్రత్యేక చట్టం రూపొందించాం. ఇప్పటివరకు 56 కంపెనీలకు అనుమతులిచ్చామని పేర్కొన్నారు.

భారతదేశంలో రాష్ర్టాలది క్రియాశీలక పాత్ర. ప్రణాళిక సంఘం స్థానంలో నూతనంగా ఏర్పడిన నీతి ఆయోగ్ టీమిండియాలా పనిచేస్తుందని కేసీఆర్ వెల్లడించారు. ప్రధాని నేతృత్వంలో ముఖ్యమంత్రులంతా అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తాం. రాష్ర్టాలకు కేంద్రం అధికంగా నిధులు, అధికారాలు ఇచ్చింది. ప్రధాని సంస్కరణ మార్గంలో పయనిస్తున్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ గొప్ప విజయం సాధించారు. అతిపెద్ద మార్కెట్ కలిగిన భారత్‌లో ఎగుమతులకు అవకాశాలు ఎక్కువ. భారత్ ఇదే విధంగా ముందుకు వెళ్తుందన్న విశ్వాసం తమకుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  China  World Economic Forum  Modi  Team India  Neeti Ayog  

Other Articles