Netaji | Subhashchandra bose |0 Gumnami Baba

Was gumnami baba actually netaji himself

netaji, Subhashchandra bose, Gumnami Baba, UP, Netaji Missing

It's one of the greatest mysteries of modern India: Was Gumnami Baba, also known as the ascetic of UP's Faizabad, actually Netaji Subhas Chandra Bose? Subhro Niyogi, Saikat Ray and a team of reporters track down some people who actually interacted with him and are convinced that it was none other tha

ఆ బాబా ఎవరో కాదు నేతాజీనే..?

Posted: 09/07/2015 03:11 PM IST
Was gumnami baba actually netaji himself

బారత స్వాతంత్ర పోరాటంలో ఎంతో పోరాట పఠిమను చాటిన సుభాష్ చంద్రబోస్ గురించి రోజుకో వార్త వెలుగులోకి వస్తోంది. విదేశీ గడ్డ మీద బారత కీర్తి పథాకాలను ఎగరవెయ్యమే కాకుండా... విదేశాల్లో ఉంటున్న భారతీయులను ఏకతాటి మీదకు తీసుకువచ్చి భరత మాత దాస్య శృంఖలాలను విముక్తంగావించేందుకు పాటుపడ్డారు. అయితే సుభాష్ చంద్రబోస్ ఏమైపోయారు..? అన్నది మాత్రం ఎప్పటికీ సమాధానంలేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రధానిగా మోదీని కలిసి నేతాజీ మరణం మీద విచారణ జరిపించాలని వినతి సమర్పించారు. అయితే తాజాగా ఓ వార్త అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నేతాజీ ఎక్కడ.. ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు. నేతాజీ పోలికలతో ఉన్న ఓ బాబా యుపిలో ఉండేవారని, స్వతంత్ర పోరాటం తర్వాత నేతాజీ బాబా అవతారం ఎత్తారని అందుకు తగిన సాక్షాధారాలను కూడా వారు ప్రదర్శిస్తున్నారు. నేతాజీ అంటే యుద్దరంగంలో ఛాణిక్యుడిగా వ్యవహరించే వారు అని అందరికి తెలుసు. మరి అలాంటి వ్యక్తి స్వాతంత్రం సిద్దించిన తర్వాత ఎక్కడికి వెళ్లారు అన్నది తేలాల్సిన విషయం.

ఉత్తర్ ప్రదేశ్ ఫజియాబాద్ లో జీవించిన గుమ్నమి బాబా అనే వ్యక్తి ఉండేవారు. ఆ బాబాకు  మిస్సయ్యాడు అనుకున్న సుభాష్ చంద్రబోస్ కు ఎన్నో పోలికలు ఉన్నాయి. రెండు ఫోటోల్లో ఉన్న వ్యక్తికి పోలికలు కనిపిస్తాయి. నిజానికి సుభాష్ చంద్రబోస్ కనిపించకుండా పోయాడన్న వార్త విన్న  తర్వాత చాలా మంది నేతాజీ కోసం ఆరా తియ్యడం మొదలుపెట్టారు. అందులో భాగంగా చాలా ప్రాంతాలు తిరిగిన నేతాజీ సన్నిహితుల్లో కొంత మందికి యుపిలో ఉంటున్న బాబా గురించి తెలిసి.. అక్కడికి చేరుకున్నారని.. ఆ తర్వాత వారు నేతాజీ కోసం వెతకడం మానేశారని తెలిసింది. ఇలా ఎందుకు అంటే ఆ బాబానే నేతాజీ కాబట్టి అని సమాధానం వస్తోంది. మొత్తానికి యుపిలో ఉన్న ఆ బాబానే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే దీని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఖచ్చితంగా ఆ బాబానే నేతాజీ అని తేలితే మాత్రం నేతాజీ ఎక్కడ అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లే.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : netaji  Subhashchandra bose  Gumnami Baba  UP  Netaji Missing  

Other Articles