Former MP CM Digvijay Singh, 68 marries Amrita Rai, 44

Digvijay singh married tv anchor amrita rai last month

Congress General secretary Digvijay Singh, digvijay singh marries Amrita Rai, rajyasabha anchor amrita rai, Digvijay Singh amrita relationship, Digvijay Singh wife amrita rai, digvijay tied knot with TV journalist Amrita Rai, Amrita Rai,Digvijay Singh,marriage,Rajya Sabha TV,Rajya Sabha TV anchor,TV anchor

Senior Congress leader Digvijay Singh has tied the knot with TV journalist Amrita Rai in Tamil Nadu.

ITEMVIDEOS: ఔను.. వాళ్లిద్దరూ పెళ్లిచేసుకున్నారు..

Posted: 09/06/2015 01:15 PM IST
Digvijay singh married tv anchor amrita rai last month

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. రాజ్యసభ టీవీలో న్యూస్ ప్రెజెంటర్ గా , యాంకర్ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు అమృతారాయ్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం గత నెలలో హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం తమిళనాడులోని ఓ హైందవ ఆలయంలో జరిగింది. దిగ్విజయ్ సింగ్, అమ్రితా రాయ్ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న విషయం గత ఏడాది ఏప్రిల్‌‌లో బయటకు వచ్చింది. దాంతో అప్పుడే తాను అమ్రితారాయ్ ను వివాహం చేసుకోనున్నట్లు దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.



తన భార్య సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. 2013లో కన్నుముశారు. తమ మధ్య సాగుతున్న సహజీవనం వార్తలు బాహ్య ప్రపంచానికి తెలియగానే.. 44 సంవత్సరాల రాయ్‌.. తాను దిగ్విజయ్ ను వివాహం చేసుకుంటానని తెలిపారు. అమెకు గతంలోనే వివాహం జరిగింది. విడాకుల వచ్చిన తర్వాత వివాహం జరుగుతుందని గతంలోనే చెప్పారు. అన్న మాట ప్రకారం ఇద్దరు ఏడాదిన్నర కాలం తరువాత వివాహం చేసుకున్నారు.  ప్రస్తుతం దిగ్విజయ్ సింగ్, అమ్రితారాయ్ లు అమెరికాలో ఉన్నారు.

దిగ్విజయ్ సింగ్ భార్య 2013లో సుదీర్ఘ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ తరువాత తాను అమ్రిత రాయ్ ను రెండో వివాహం చేసుకుంటానని ప్రకటించగానే.. ఆ ప్రకటన అప్పట్లో ఆయన కుటుంబంలో ప్రకంపనలను రాజేశాయని సమాచారం. 68 ఏళ్ల దిగ్విజయ్ సింగ్‌కు నలుగురు కుమార్తెలు ఒక కుమారుడున్నారు. అయితే అందరి సమ్మతి మేరకే ఆయన అమ్రితను రెండో వివాహం చేసుకున్నారని ఒక వైపు, కుటుంబసభ్యల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆయన అమ్రితను వివాహామాడారి మరోవైపు నుంచి వార్తలందుతున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amrita Rai  Digvijay Singh  marriage  Rajya Sabha TV  Rajya Sabha TV anchor  TV anchor  

Other Articles