Pawan Kalyan | Bhimavaram | pawan Kalyan fans

Police arrest ten pawan kalyan fans in bhimavaram

Pawan Kalyan, Bhimavaram, pawan Kalyan fans, prabhas fans

Police arrest ten Pawan kalyan Fans in Bhimavaram. two days back some unknown persons removed Pawan Kalyan flexis in Bhimavaram.

ITEMVIDEOS:పది మంది పవన్ కళ్యాణ్ అభిమానుల అరెస్ట్

Posted: 09/05/2015 10:09 AM IST
Police arrest ten pawan kalyan fans in bhimavaram

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇద్దరు తెలుగు హీరోల అభిమానుల మధ్య నిప్పురాజుకుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు.. పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించడం... చించడంతో సమస్య తలెత్తింది. తమ హీరో ఫ్లెక్సీలను కావాలనే మరో హీరో అభిమానులు చించారని పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైరయ్యారు. దాంతో అనుమానం ఉన్న వారి ఇళ్ల మీద దాడి చేశారు. కాగా పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. భీమవరం మున్సిపాలిటీ సిబ్బందితో ఏర్పాటు చేసిన అన్ని ఫ్లెక్సీలను తొలగించారు. ఇక ముందు అనుమతులు లేకుండా ఫ్లెక్సీలను ఏర్పాటు చెయ్యడానికి వీలు లేదని భీమవరంలో ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే రెండు వర్గాల కారణంగానే పరిస్థితి దారుణంగా మారిందని పోలీసులు బావిస్తున్నారు.

భీమవరంలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితి మీద పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా పది మంది పవన్ కళ్యాణ్ అభిమానులను అరెస్ట్ చేయడం తాజాగా సంచలనం రేపింది. దీని మీద పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవర్గానికి చెందిన వారు తమ అభిమాన హీరో ఫ్లెక్సీలను తొలగిస్తే.... తమ మీద కేసులు పెట్టడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. చిలికి చిలికి గాలి వానగా మారుతున్న భీమవరం అభిమానుల గొడవ చిరవకు ఎక్కడి దాకా చేరుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Bhimavaram  pawan Kalyan fans  prabhas fans  

Other Articles