Egg shaped homes | House, | Google

Egg shaped home powered by sunlight and wind lets you live anywhere

Egg shaped homes, House, Google, Wind power, New homes

Egg shaped home powered by sunlight and wind lets you live anywhere. The sleek, egg-shaped capsule resembles a spaceship, complete with antennae and a layer of futuristic cells. But the striking design from Slovakian group Nice Architects represents a creative effort to offer housing solutions for this planet. The 'Ecocapsule' is a mini apartment with all the conventional luxuries you would expect, but generates its own clean energy and can be situated anywhere, from city to tundra.

ఆ ఇళ్లు వెరీ గుడ్డు.. అన్ని పరిస్థితులను తట్టుకుంటాయి

Posted: 08/25/2015 01:04 PM IST
Egg shaped home powered by sunlight and wind lets you live anywhere

ప్రతి మనిషి ఉండటానికి ఇళ్లు కావాలి.. అయితే ఇళ్లలో రకరకాలు ఉంటాయి. కాగా అన్ని ఇల్లు అన్ని రకాల పరిస్థితులను తట్టుకుంటాయి అని చెప్పలేం. కానీ తాజాగా గుడ్డును పోలిన ఓ డిజైన్డ్ ఇల్లు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అవును చూడడానికి అచ్చం గుడ్డు ఆకారంలో ఉంటే ఈ ఇల్లు ఒకరికి ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. సోలార్ పవర్ తో ఎనర్జీని పొందే కొత్త ఇల్ల డిజైన్ అందరిని ఆకర్షిస్తోంది. సోలార్ పవర్ ను వినియోగించుకునే ఈ ఇల్లు ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటాయి. ఎండ, వాన, చలి ఇలా అన్ని రకాల వాతావరణాలను తట్టుకోవడమే కాకుండా.. కొండలు, హిమపాతాలు, వరదలు ఇలా ఎలాంటి పరిస్థితులనైనా కూడా ఈ ఇళ్లు తట్టుకుంటాయి. అందుకే తాజాగా ఈ మోడల్ ఇల్లు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి.

గుడ్డును పోలిన తాజా ఇళ్ల నిర్మాణం ఎంతో నేర్పుగా జరిగింది. బాడీ మొత్తం సోలార్ షెల్స్ తో తయారు కావడంతో సోలార్ వవర్ ను తీసుకొని అందులో కావాల్సిన అవసరాలను తీరుస్తుంది. ఇక ఈ డిజైల్ లో ఉన్న విండ్ టర్బైన్ గాలి సహాయంతో తిరుగుతూ కరెంట్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక దీని పైభాగంలో ఉండే ప్రత్యేక నిర్మాణాలు వాన నీటిని ఒడిసి పట్టుకుంటాయి. అలా వచ్చిన ప్రతి చుక్క నీటిని కూడా లోపల ఉండే వారికి నీటి అవసరాలను కూడా తీరుస్తుంది. ఇక 750 వాట్ ల విద్యుత్ ఉత్పత్తి దీని స్పెషాలిటి. ఇలా మనిషికి కావాల్సిన అన్ని అవసరాలను ఈ కొత్త మోడల్ ఇల్లు తీరుస్తోంది. అయితే ఆరేళ్లు ఎంతో కష్టపడి ఈ డిజైన్ ను రెడీ చేశారు ఆర్కిటెక్టర్లు. గూగల్ తన ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఈ ఇళ్లను అందిస్తోంది. తమ ఉద్యోగులు కొత్త ఇల్లను వెతికే క్రమంలో తాత్కాలికంగా ఈ ఇల్లలో ఉండటానికి అవకాశం కల్పిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Egg shaped homes  House  Google  Wind power  New homes  

Other Articles