Punjab Police Serves Notice to Radhe Maa To Join Probe | Surinder Mitter Case | Radhe Maa Controversy

Punjab police serves notice to radhe maa surinder mittal filed case

Radhe Maa Controversy, Radhe maa news, Radhe maa, punjab police, punjab police filed case radhe maa, surinder mittal, god woman radhe maa

Punjab Police Serves Notice to Radhe Maa Surinder Mittal Filed Case : Punjab Police has issued a notice to controversial 'godwoman' Radhe Maa asking her to join the probe in connection with the complaint lodged against her by a local resident Phagwara alleging that she had hurt his religious sentiments and for spreading obscenity and vulgarity.

మరో చిక్కుముడిలో చిక్కుకున్న రాధే మా

Posted: 08/24/2015 09:53 AM IST
Punjab police serves notice to radhe maa surinder mittal filed case

తనను తాను దేవతగా ప్రచారం చేసుకుంటూ సొంత డప్పు వాయించుకుంటున్న రాధే మా మరో చిక్కుముడిలో చిక్కుకుంది. ఇప్పటికే వరకట్నం వేధింపుల కేసుతోపాటు మరెన్నో వివాదాల్లో చిక్కకుని పోలీసుల విచారణకు హాజరైన ఈమెపై మరో ఫిర్యాదు నమోదైంది. దీంతో మరోసారి విచారణకు హాజరు కావాలంటూ పంజాబ్ పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని పగ్వారా నివాసి అయిన సురీందర్ మిట్టల్ తాజాగా రాధే మాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె మత విశ్వాసాలను కించపరిచారని ఆయన తన ఫిర్యాదు పేర్కొన్నాడు. అంతేకాదు.. రాధే మా డబ్బులు ఇవ్వాల్సిందిగా తనను డిమాండ్ చేసి, ఇవ్వనందుకు బెదిరించారని తెలిపాడు. ఈ విధంగా తనను ఇబ్బంది పెట్టినందుకు రాధే మాతోపాటు ఆమె సోదరి రజ్జో, కోడలు మేఘ, సహాయకురాలు రీతూ సరీన్, అనుచరుడు సంజీవ్ గుప్తాలపై కూడా కేసు నమోదు చేయాలని అతగాడు కోరాడు.

రాధే మాతో మాట్లాడినప్పుడు రికార్డ్ చేసిన ఫోన్ సంభాషణలను కూడా సురీందర్ పోలీసులకు అందజేశారు. అలాగే ఆమె అసభ్యత, అశ్లీలతను ప్రచారం చేసి మత విశ్వాసాలను దెబ్బ తీస్తోందని.. ఆమెపై కేసు నమోదు చేయాలంటూ అతగాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆదివారం రాత్రి ఓ పోలీస్ అధికారిక ముంబైకి వెళ్లి.. రాధే మాకు నోటీసు జారీ చేశారు. వరుసగా వస్తున్న ఫిర్యాదులను చూస్తుంటే.. రాధే మా చిట్టా చాలా పెద్దదిగా వున్నట్లు తెలుస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : radhe maa controversy  dowry cases  Crime News  

Other Articles