another terrorist holed up in kashmir

Another terrorist caught live by indian forces

another terrorist caught live, indian army forces, terrorist holed up in kashmir, taliban group, lashkar e taiba, pakistan terrorist, holed up, gun fight, indian army, kashmir, ritinpura

after pakistan terrorist mohammad naved caught in udampur, another terrorist holed up in kashmir by indian army forces

సజీవంగా దోరికిన మరో పాక్ ప్రేరేపిత ఉగ్రవాది

Posted: 08/11/2015 06:11 PM IST
Another terrorist caught live by indian forces

జమ్మూకాశ్మీర్లో మరోసారి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోయారు. భారత సరిహద్దు దాటి లోపలికి చొచ్చుకొచ్చి సైనికులపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్ ఉగ్రవాదులను ధీటుగా ఎదుర్కొంది. జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో రత్నిపోర సెక్టార్ లో పాక్ దళాలు కాల్పులకు దిగాయి. మోటార్లు, రాడర్లతో దాడులకు పాల్పడాయి. ఉగ్రవాదలును సరిహద్దు దాటించే యత్నంలో కాల్పలు జరిపాయి.

ఉగ్రవాద కాల్పులను భారత్ సైన్యం ధీటుగా జవాబిచ్చింది. ఈ క్రమంలో భారత బలగాలకు ఉగ్రవాదులకు మధ్య కొన్ని గంటలపాటు కాల్పులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఓ ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నట్లు సమాచారం. కాగా ఇరువైపుల కాల్పుల మోతతో ప్రతిధ్వనించడంతో రత్నిపురా సెక్టార్ లో వున్న స్థానికులు భయాంధోళనకు గురవుతున్నారు. బిక్కబిక్కుమంటూ కాలం గడపుతున్నారు. కాగా, మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నామని విషయాన్ని అధికారికంగా మాత్రం భారత బలగాలు ప్రకటించలేదు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan terrorist  holed up  gun fight  indian army  kashmir  

Other Articles