Pawan Kalyan | Janasena | AP | Special status

Jana sena activists demands pawan kalyan to respond on ap special status

Pawan Kalyan, Janasena, AP, Special status, Pawan Kalyan updates, janasena News

Jana Sena activists demands Pawan Kalyan to respond on AP Special Status. Janasena protesters protest in Tirupati for allot special status for state of ap.

ITEMVIDEOS:పవన్ కళ్యాణ్ రావాలి.. ప్రత్యేక హోదా తేవాలి

Posted: 08/10/2015 04:18 PM IST
Jana sena activists demands pawan kalyan to respond on ap special status

మేధావి మౌనం సమాజానికి మంచిది కాదు అని ఓ సామెత. ఎందుకు అంటే మేధావి మౌనం సమాజానికి ఎంత మాత్రం మంచిది కాదు. అయితే .జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విఫయంలోనూ ఇలానే జరుగుతోంది అంటున్నారు కొంత మంది పవన్ కళ్యాణ్ అభిమానులు. జనసేన పార్టీ అధినేత, సినీ హీరో  పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత చాలా కాలం వరకు రాజకీయాల మీద పెద్దగా స్పందించలేదు. మార్పును కోరుకునే, ఎంతో విజన్ ఉన్న నాయకుల్లో వపన్ కళ్యాణ్ ఒకరు. రైతుల కన్నీళ్లు తుడిచే జననేతగా పవన్ కళ్యాణ్ ఒకరు అని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. అయితే ప్రశ్నించే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పందిస్తాను అని పదే పదే చెప్పుకొచ్చే పవన్ కళ్యాణ్ టైం వచ్చేసిందని అతని అభిమానులు అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించాల్సిన... ప్రశ్నించాలని ఓ సగటు మనిషిగా, తెలుగు వ్యక్తిగా చాలా మంది కోరుకుంటున్నారు.



ఏపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ తిరుపతిలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమనులు నిరసన తెలిపారు. అయితే అన్నా పవన్ కళ్యాణ్ రావాలి.. ప్రత్యేక హోదా మీ ద ప్రశ్నించాలని బ్యానర్లతో తమ నిరసను తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని వారు అంటున్నారు. గతంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ టిడిపి, బిజెపి పార్టీలకు మద్దతుగా నిలిచినందుకూ గెలిచారని.. ఎంతో చేయగల నేత పవన్ కళ్యాణ్ ఇక స్పందించాల్సిన అవసరం ఉంది అని వారు అంటున్నారు. నిజమే ఎందుకంటే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగితే పరిస్థితి మరోలా ఉంటుంది. అది అందరికి తెలుసు అది నరేంద్రమోదీ దగ్గరి నుండి చంద్రబాబు వరకు, ఢిల్లీలో ఉన్న మంత్రుల దగ్గరి నుండి గల్లీలోని మామూలు వ్యక్తులకు కూడా తెలుసు. అందుకే అందరూ కోరుకుంటున్నది ఒక్కటే పవన్ కళ్యాణ్ రావాలి... ప్రత్యేక హోదాపై ప్రశ్నించాలని... మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  Janasena  AP  Special status  Pawan Kalyan updates  janasena News  

Other Articles